Kiran Abbavaram Wedding Pics: రాణి గారి మెడలో మూడు ముళ్లు వేసిన రాజా వారు... కిరణ్ అబ్బవరం పెళ్లి ఫోటోలు
రాజా వారు రాణి గారు వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. అదేనండీ... యువ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్ గురువారం రాత్రి పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలు చూడండి.
చిత్రసీమలో ఎటువంటి నేపథ్యం లేకుండా కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువకుడు కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిలిమ్స్ నుంచి నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. 'రాజా వారు రాణి గారు'తో కథానాయకుడిగా వెండితెరపైకి వచ్చారు. తొలి సినిమాలో తన సరసన నటించిన అమ్మాయి రహస్యతో ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
రహస్య గోరఖ్ హైదరాబాద్ అమ్మాయి. 'రాజా వారు రాణి గారు' తర్వాత మరో సినిమా చేయలేదు. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా 'క' సినిమా నిర్మాణ బాధ్యతల్లో ఆవిడ పాలు పంచుకుంటున్నారు.
పెళ్లికి ముందు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కిరణ్ అబ్బవరం. మరిన్ని ఫోటోలు, సినిమా - రాజకీయ వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.