Chandrayaan will be able to carry humans to Moon : చంద్రయాన్ 3 విజయవంతం అయి ఏడాది గడిచింది. చంద్రయాన్ 4 కోసం ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది ఇే సమయానికి ఇంకేముంది తర్వాత చంద్రుడిపై మనుషుల్ని పంపడమే అన్న చర్చ  జరిగింది. నిజానికి చంద్రయాన్ ఇంకో ఎన్నో దశలు దాటిన తర్వాతనే మనుషుల్ని పంపే ప్రక్రియ ఉంటుంది. అన్ని సక్సెస్ కావాలి. అసలు మనుషుల్ని చంద్రుడిపైకి పంపాలంటే ఎన్ని దశలు దాటాలో ఇప్పుడు చూద్దాం. 


2028లో చంద్రయాన్ 4 - ఈ దశలో ఏం చేస్తారంటే ?      


చంద్రయాన్ 4లో భాగంగా చంద్రుడిపై ల్యాండ్ అవడమే కాకుండా అక్కడి మట్టి, రాళ్ల శాంపిల్స్‌ని తీసుకురానున్నార.  చంద్రుడిపై ఉన్న మట్టి శాంపిల్స్‌ని జాగ్రత్తగా సేకరించి...వాటిని అంతే జాగ్రత్తగా భూమిపైకి తీసుకు వస్తే ఓ గొప్ప ముందడుగు పడినట్లే.  ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలు  అమెరికా,  సోవియట్ యూనియన్,  చైనా ఈ నమూనాలు సేకరించాయి.  ఈ లక్ష్యాలు సాధించడం అంత సులువేమీ కాదని ఇస్రోకు తెలుసు. అందుకే డిజైన్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికి నలుగైదు డిజైన్లు పూర్తి చేశారు. 2028లో నాలుగో దశ చంద్రయాన్ లాంచ్ చేస్తారు. 


చంద్రునిపై చరిత్ర సృష్టించి ఏడాది, దేశమంతా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్ 3


ఫలితాలను బట్టి తదుపరి దశ ప్రయోగాలు


చంద్రయాన్ ఫోర్ ..  మానవుల్ని చంద్రుడిపైకి తీసుకెళ్లే ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇస్రోకు మరింత మద్దతు లభిస్తుంది. ఈ ప్రయోగం తర్వాత చంద్రుడిపై ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం  చేసి.. మానవ రహిత మాడ్యూల్ ను చంద్రుడిపైకి పంపే ఏర్పాట్లు తర్వాత దశలో చేస్తారు. చంద్రుడి మీద దిగేలా మానవ రహిత ల్యాండర్లను పంపించడమే కాదు.. సదరు ల్యాండర్ తిరిగి భూమికి తిరిగి వచ్చేలా ప్రయోగాలు చేస్తారు. ఇలా చేయాలంటే చంద్రుడికి కొంత ఎత్తులో కమాండ్ మాడ్యూల్ ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం ఓ దశ ప్రయోగాలు చేయవచ్చు. 


చంద్రయాన్ 4 మిషన్ లక్ష్యాలివే, ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్రో చీఫ్


మానవ సహిత ప్రయోగానికి మరన్ని ప్రయోగాలు                       


చంద్రయాన్ మీదకు వ్యోమగాముల్ని పంపేందుకు మానవ రహితంగా ప్రయోగాలు చేయాలని అందు కోసం.. ఏడెనిమిది దశల వరకూ పట్టవచ్చు.  ఆ తర్వాత మానవ సహితంగా ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మొత్తంగా  చంద్రయాన్ 10  లేదా 11 ప్రయోగాల్లో మావన సహిత అంతరిక్ష ప్రయోగాలు, చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలు ఇస్రోకు సాధ్యమవ్వొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టు చంద్రయాన్. ఇదే సాధ్యమైతే.. ప్రపంచ జీవన విధానం మారిపోతుంది. అందుకే ఇస్రో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా.. కాస్త ఆలస్యమైనా క్రమబద్దమైన పరిశోధనలకు పెద్ద పీట వేస్తోంది.