Crocodile Found In Maldakal: ఎప్పటిలానే పొలంలో పనికి వెళ్లిన కూలీలు భారీ మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా (Gadawal District) మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక చాకలి కందన్ సవారి సీడ్ పత్తి పొలంలో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలంలో పని చేస్తోన్న కూలీలకు మొసలి కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.