Budameru Gandi works Completed at Vijayawada | బుడమేరు గండ్లు పూడ్చివేత - విజయవాడకు తప్పిన వరద ముప్పు
బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయి విజయవాడ పట్టణ ప్రజలకు వరద ముప్పు తప్పినట్లయింది. ఇప్పటికే సిబ్బంది రెండు గండ్లు పూడ్చివేయగా.. తాజాగా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద తాజాగా మూడో గండిని పూడ్చే ప్రక్రియ పూర్తయింది. అంతకుముందు మంత్రి నారా లోకేశ్ పనులను పరిశీలించారు. వరద ఉద్ధృతి పెరిగిన క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే రెండు గండ్లను పూడ్చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన సీఎం రేవంత్
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్న కమిటీని అభినందించారు. ఈసారి కూడా అదేస్థాయిలో 70 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్న కమిటీ ప్రయత్నం అభినందనీయమన్నారు. వినాయకుడి దయవల్లే భారీ వరదల నుంచి త్వరగా బయటపడ్డామన్నారు రేవంత్ రెడ్డి. గొప్పగా ఖైరతాబాద్ గణేష నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం
విజయవాడని వరదలు చుట్టుముట్టాయి. బెజవాడ విలయానికి ఏపీలోని ఇతర ప్రాంతాలు కూడా కంటతడి పెట్టాయి. తమకు తోచినంత సాయం చేయడానికి అన్ని ప్రాంతాల వారు ముందుకొచ్చారు. కేవలం ఆర్థిక సాయమే కాదు, నేరుగా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలబడేందుకు కూడా అన్ని ప్రాంతాలనుంచి స్వచ్ఛందంగా కొంతమంది కదలి వచ్చారు. నెల్లూరు జిల్లానుంచి కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. విరాళాలివ్వడంలో, బాధితుల్ని ఆదుకోవడంలో నెల్లూరు నేతలు, అధికారులు, ప్రజలు ఓ అడుగు ముందున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


70 ఏళ్ల మహాగణపతికి 70 అడుగుల విగ్రహం- ఖైరతాబాద్ గణేషుడి విశేషాలు తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని గణేష్ మండపాలు ఉన్నా.. ఎవరు ఎక్కడ పూజలు చేసినా అందరూ మాట్లాడుకునేది మాత్రం ఖైరదారాబాద్ వినాయకుడి గురించే. ఏటా ఏదో ప్రత్యేక రూపంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేకాకుండా దేశమంతా తమవైపు చూసుకునేలా చేస్తారు ఇక్కడ కమిటీ సభ్యులు. గణేష్ పూజ చర్చ వచ్చిందంటే చాలు ఖైరతాబాద్ గణపతి గురించి ప్రస్తావన రానిదే ఆ డిస్కషన్ పూర్తి కాదు. అలాంటి ఖైరతాబాద్‌ లంబోదరుడు ఈసారి కూడా ప్రత్యేకత చాటుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌- తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు
తెలంగాణలో పలువురు ఐపీఎస్ ఆఫీసర్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ను తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటి వరకు సీపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేశారు. ఆయన్ని విజిలెన్స్ డీజీగా పంపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి