Devara Trailer Release Date: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న క్రేజీ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకున్నాయి.  త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.        


సెప్టెంబర్ 10న ‘దేవర’ ట్రైలర్ విడుదల


‘దేవర’ సినిమా ట్రైలర్ విడుదల గురించి చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటన చేశారు. సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను హీరో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ సముద్రంలో పెద్ద రాయి మీద నిల్చొని ఉన్నాడు. వెనుక అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చేతిలో పదునైన ఆయుధాన్ని పట్టుకుని కోపంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ అప్ డేట్ చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






ట్రైలర్ రిలీజ్ అక్కడేనా?


‘దేవర’ సినిమా ప్రమోషన్స్ ను నార్త్ నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముంబై వేదికగా పెద్ద ఈవెంట్ ను నిర్వహించడంతో పాటు,  సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్  చేస్తోంది. సుమారు 2 నిమిషాల 45 సెక‌న్ల నిడివితో ఇప్పటికే ట్రైలర్ కట్ పూర్తైనట్లు సమాచారం. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత మిగిలిన రెండు పాటలను రిలీజ్ చేసి మూవీపై  భారీగా అంచనాలు పెంచాలని భావిస్తున్నారు. అదే ఊపులో ‘దేవర’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.


ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల


‘దేవర’ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలు థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ దుమ్మురేపుతున్నాయి. అమెరికాతో పాటు, కెనడాలో బుకింగ్స్ ఓపెన్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో  మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె  నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ గా నటిస్తుండగా,  ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో, నరైన్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.



Read Also: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ