SRH vs MI Live Score: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబైపై హైదరాబాద్ ఘన విజయం

Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 27 Mar 2024 11:26 PM
SRH vs MI IPL 2024: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబైపై హైదరాబాద్ ఘన విజయం

ఉప్పల్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.

SRH vs MI IPL 2024: ఊచకోత అంటే ఇదీ భయ్యా, IPL చరిత్రలోనే అతిపెద్ద టార్గెట్

ఉప్పల్‌ వేదికగా జరిగిన బ్యాటర్ల విశ్వరూపంతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి  277 పరుగుల భారీ స్కోరు చేసింది. బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు అందరూ సన్‌రైజర్స్‌ సునామీలో కొట్టుకుపోయారు.

SRH vs MI Live Score: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

SRH vs MI Live Score:  ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది.  క్లాసెన్ 34 బంతుల్లో 80 నౌటౌట్, మార్ క్రమ్ 42 పరుగులతో నౌటౌట్ గా నిలిచారు. 

SRH vs MI Live Score: 19 ఓవర్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ 256/3

SRH vs MI Live Score: ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది.  క్లాసెన్ 60 నౌటౌట్, మార్ క్రమ్ 41 క్రీజులో ఉన్నారు.

SRH vs MI: 18 ఓవర్లకు హైదరాబాద్ 243/3

ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 18 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది.  క్లాసెన్ 51 నౌటౌట్, మార్ క్రమ్ 40 నాటౌట్ గా ఉన్నారు.

SRH vs MI: 23 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచరీ

ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ 23 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచరీ సాధించాడు.

SRH vs MI: 17 ఓవర్లకు హైదరాబాద్ 232/3

SRH vs MI: 17 ఓవర్లకు హైదరాబాద్ 232/3
ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 17 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసింది. క్లాసెన్ 41 నౌటౌట్, మార్ క్రమ్ 39 నాటౌట్ గా ఉన్నారు.

16 ఓవర్లకు హైదరాబాద్ 214/3


ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 16 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది. 

31 బంతుల్లో 50 భాగస్వామ్యం

ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు క్లాసెన్, మార్ క్రమ్ 31 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

15వ ఓవర్లకు హైదరాబాద్ 202/2

ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 15వ ఓవర్లో 200 మార్క్ దాటింది.

Chandra Babu News:ప్రజాగళం ప్రారంభం - పలమనేరులో చంద్రబాబుకు ఘనస్వాగతం

Praja Galam News: ప్రజాగళం కోసం పలమనేరు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఘన స్వాగతం లభించింది. టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల జెండాలు రెపరెపలాడాయి. కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.  

Jagan Bus Yatra: కాసేపట్లో జగన్ బస్‌ యాత్ర ప్రారంభం- తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు

Jagan Bus Yatra: వైసీపీ అధినేత జగన్ చేపట్టబోయే మేమంతా సిద్ధం బస్ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపుల పాయ చేరుకున్న జగన్... అక్కడ తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. 

CM Revanth Reddy News: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి 

CM Revanth Reddy Delhi Tour:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే  కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశంలో పాల్గొంటారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. ఇప్పటి వరకు 9 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ లేదా రేపు మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ఫైనలైజ్ చేయనుంది. 

Jangaon News: జనగామలో భార్యాభర్తల ఆత్మహత్య

Tamilanadu Couple Suicide In Jangaon Due to Family Disputes: జనగామ జిల్లాలో భార్యభర్తల ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన ఫ్యామిలీ రాత్రి సూసైడ్ చేసుకుంది. భార్యభర్త ఇద్దరు కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లు తమిళనాడుకు చెందిన సెల్వరాజు, భాగ్యలక్ష్మి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే దంపతులు ఇద్దరూ బొగ్గుముద్దలైపోయారు. పోలీసులకు సమాచారం అందించిన స్థానికిలు వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. 

Jangaon News: జనగామలో భార్యాభర్తల ఆత్మహత్య

Tamilnadu Couple Suicide In Jangaon Due to Family Disputes: జనగామ జిల్లాలో భార్యభర్తల ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన ఫ్యామిలీ రాత్రి సూసైడ్ చేసుకుంది. భార్యభర్త ఇద్దరు కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లు తమిళనాడుకు చెందిన సెల్వరాజు, భాగ్యలక్ష్మి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే దంపతులు ఇద్దరూ బొగ్గుముద్దలైపోయారు. పోలీసులకు సమాచారం అందించిన స్థానికిలు వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. 

Background

Latest Telugu Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఉపందుకోనుంది. నేటి నుంచి రెండు పార్టీల అధినేతల ప్రజాక్షేత్రంలోకి దూకనున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు. 


అధినేతల ప్రచారం 


ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్టు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మారబోతున్నాయి. ఇప్పటి వరకు అడపాదడపా ప్రజల్లోకి వెళ్లిన నేతలంతా ఇకపై ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు జనంలోనే జనంతోనే ఉండబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే ఎదుకు ఓటు వేయాలనే విషయంపై నేతలు ప్రజలను ఒప్పించబోతున్నారు. ఇప్పటి వరకు ఆయా అభ్యర్థులు ప్రజల ముందుకు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టారు. ఇప్పుడు అధినేతలే నేరుగా జనం ముంగిటకు రానున్నారు. 


సమ్మర్‌లో మరింత హీట్


వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ బరిలోకి దూకుతున్నాయి. వైసీపీ తన అభ్యర్థులను ఒకేసారి ఖరారు చేసి వారితో ఇప్పటి వరకు ప్రచారం చేయించుకుంది. పార్టీ శ్రేణులను సన్నద్దం చేసేందుకు సిద్ధం పేరుతో జగన్ నాలుగు సెగ్మెంట్స్‌లో భారీ బహిరంగ సభలు పెట్టారు. ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారితో ప్రచారం చేసేందుకు మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత నేరుగా ప్రజల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. వివిధ పథకాలు బటన్స్‌ నొక్కడానికి, వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్లింది లేదన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. వాటన్నింటినీ ఎలా తిప్పి కొడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 


మేమంతా సిద్ధమంటున్న జగన్


మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టే బస్సు యాత్ర 21 రోజులపాటు సాగనుంది. గతంలో సిద్ధం సభలు నిర్వహించిన నియోజకవర్గాలను మినహాయించి ఈ యాత్ర సాగనుంది. ఈ ఉదయం ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. తొలి రోజుర కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో సాగనుంది. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే యాత్ర వేంపల్లి, వీరపురాయనిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. అక్కడి నుంచి యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుని రాత్రి బస చేస్తారు. ఇలా రోజుకో పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో బస్ యాత్ర సాగనుంది. 


ప్రజాగళంపేరుతో బాబు


ఎన్నికల నోటిఫికేషన్ ముందు వివిధ పేర్లతో ప్రజల్లోకి తిరిగిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రజాగళం పేరుతో ప్రచారం చేపట్టనున్నారు. నేటి నుంచి చేపట్ట ప్రచారం రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ సందర్భంగా రోడ్‌షోలు, ప్రజాదర్భార్లు నిర్వహిస్తారు. ఇవాళ పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో సాగనుంది యాత్ర. 28న రాప్దాడు, శింగనమలై, కదిరి నియోజకవర్గాల్లో, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. 


30 నుంచి పవన్‌ ప్రచారం 
ఈ నెల 30 వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా ప్రచారంలో పాల్గోనున్నారు. పిఠాపురం నుంచి పవన్ ప్రచారం ప్రారంభంకానుంది. ఈ ప్రచారంలో కూటమి విధివిధానాలు వివరించడంతోపాటు మేథావులు, వివిధ వర్గాలతో పవన్ సమావేశం కానున్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.