Telugu breaking News: పిఠాపురం నుంచి పవన్ పోటీ
Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
Pawan Kalyan At Pithapuram: పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
బ్యాటరీ టార్చ్ వెలిగిద్దాం.. చీకటిని పారదోలుదాం అంటూ నినదిస్తున్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారయణ. బ్యాటరీ టార్చ్‌ను జై భారత్ నేషనల్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరికీ ఈ సింబల్ ఇస్తున్నట్టు పేర్కొంది.
ఈ మేరకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణకు భారత్ ఎన్నికల సంఘం సమాచారం అందించింది.
Bhatti Vikramarka Meets Bankers Committee: హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. పట్టు గూళ్ల పెంపకం రైతులకు 1, 83, 41,000 రూపాయల ప్రోత్సాహక ఇన్సెంటివ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క... " రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం హౌసింగ్ విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలి. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయండి. అని అన్నారు.
స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు భట్టి విక్రమార్క సూచించారు. "స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలి. రానున్న ఐదేళ్లలో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇస్తాం. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. వ్యవసాయం మా ప్రభుత్వం ప్రాధాన్యత. రుణాలు ఇచ్చే విషయంలో రైతుల పట్ల నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శిస్తే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. ఫలితంగా ఆత్మహత్యలకు దారితీస్తుంది. తాను ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న సమయంలో విద్య రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభం అయ్యాయి. 20 ఏళ్లు అయినా ఆ రుణాల జారీలో ప్రగతి కనిపించడం లేదు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి సంపదను కింది వర్గాలకు పంపిణీ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించండి సంపదను సృష్టించండి రాష్ట్రంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది. అని బ్యాంకర్లకు సూచించారు.
Penamaluru News: పెనమలూరులో బోడేకు టికెట్ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబే ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. కొన్ని అనివార్య కారణాలతో సీటివ్వలేకపోతున్నామని వివరించారు. టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనంలో బోడే ప్రసాద్ , బోడే అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. పెనమలూరు టిక్కెట్ రేసులో పలువురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దేవినేని ఉమా పేరును పరిశీలించినా స్థానికేతరుడు కావడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తుమ్మల చంద్రశేఖర్ పేరును కూడా పరిశీలిస్తోంది టీడీపీ అధిష్టానం. ఇటీవల ఎమ్మెల్యే పార్థసారధితో కలిసి టీడీపీలో చేరిన తుమ్మల చంద్రశేఖర్.
చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగిన టిడిపి నేత.
పుట్టపర్తి సీటు వడ్డెర సామాజిక వర్గానికి కేటాయించాలని ఆందోళన.
తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగిన మల్లెల జయరాం.
రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మందికిపైగా వడ్డెరలు ఉన్నారంటున్న మల్లెల..
తమ సామాజిక వర్గానికి అన్యాయం చేయొద్దంటున్న మల్లెల జయరాం
కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్ తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేష్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకీ సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర స్వామి, నరసింహులు, శాంతకుమారి, తదితరులు చేరారు.
Suicide News : దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ఎంబీఏ చదువుతున్న సాహితి చనిపోయారు. ఆమెది ములుగు. యువతి మృతి పై చైతన్య పురి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Amaravathi News : అమరావతిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ సమావేశమయ్యారు. ఆయన ఈ మధ్యకాలంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.
Background
Latest Telugu breaking News: తెలుగుదేశం, జనసేన మరో విడత జాబితాను విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు దాదాపు వందకుపైగా అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పుడు మరో విడతలో 20 నుంచి 30 మంది అసెంబ్లీ, పది మంది పార్లమెంట్ సభ్యుల జాబితాను ఇవాళ విడుదల చేయనున్నారని ప్రచారం నడుస్తోంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 25 మంది అసెంబ్లీ అభ్యర్థులతోపాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు. టీడీపీ ఇప్పటికే 94 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 31 స్థానాలు కేటాయించగా మిగిలిన 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినందున ఇంకా 50 మంది పేర్లు రివీల్ చేయాల్సి ఉంది. అందులో ఇవాళ 25 మంది పేర్లు ప్రకటించనున్నారు.
బీజేపీతో పొత్తు కుదరక ముందే టీడీపీ జనసేన తమ మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. అందుకే అప్పుడు ఈ జాబితాలో ఎంపీలకు చోటు ఇవ్వలేదు. ఇప్పుడు పొత్తు ఖరారు అయినందుకు ఎంపీలకి కూడా లైన్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంది. మొదటి దశలో 10 మంది ఎంపీ అభ్యర్థులు టీడీపీ ప్రకటించనుంది.
జనసేన విషయానికి వస్తే ఇప్పటికే రెండు జాబితాల్లో ఆరుగురు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. ఇవాళ మరో ఐదారుగురిని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -