Telugu breaking News: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ - ఒకే రోజు 44 మందికి స్థానచలనం
Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఇష్యూలపై లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Telangana News: తెలంగాణ ప్రభుత్వం సోమవారం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఒకే రోజు ఏకంగా 44 మందికి స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి నియమితులయ్యారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యార్ నియమితులయ్యారు.
Andhra Pradesh News: రాష్ట్ర ఐటీ, విద్యా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వేదపడింతుల మంత్రనోచ్ఛరణ మధ్య సచివాలంలోని నాల్గో బ్లాక్‌లో బాధ్యతలు తీసుకున్నారు. నాల్గో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ 208 నెంబర్ రూమ్‌ను లోకేష్‌కు కేటాయించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత లోకేష్ మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. లోకేష్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, టీజీ భరత్, ఎస్ సవితతోపాటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొండా ఉమామేశ్వరరావు, భాష్య ప్రవీణ్, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన నిధులను ముందే ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాదికి సరిపడా బడ్జెట్ 406.75 కోట్ల రూపాయల నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుద చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉమ్మడిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, మెడికల్, నర్సింగ్, టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బందికి వేతనాలుగా ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ తొలి భేటీ సమావేశమైంది. పది గంటలకు సమావేశమైన మంత్రిమండలి ముందు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఉంచింది ఆర్థిక శాఖ. రాష్ట్రంలో అన్ని కలుపుకొని 14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రాథమిక నివేకి సమర్పించిందని సమాచారం.
Background
Latest Telugu Breaking News: 18వ లోక్‌సభ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. పది రోజులు సాగే లోక్‌సభ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక , రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. కాసేపట్లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణఁ చేయనున్న భర్తృహరి.,... మిగతా సభ్యులతో ప్రమాణం సభలో ప్రమాణం చేయిస్తారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. తర్వాత సీనియార్టీబట్టి మంత్రులు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన సభ్యులు ఇవాళ ప్రమాణం చేస్తే... తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీలు మంగళవారం ప్రమాణం చేయనున్నారు.
బొటాబొటీ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి స్పీకర్ పదవి ఎవరికి ఇస్తుందనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఓంబిర్లానే లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగించేందుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. బలరాం జాఖడ్ తర్వాత వరుసగా లోక్‌సభ స్పీకర్ ఎన్నికయ్యే వ్యక్తిగా చరిత్ర సృష్టించనన్నారు.
రెండు రోజుల పాటు లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారాలకే సమయం సరిపోతుంది. అందుకే 26న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత రోజు అంటే 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. దీనిపై మిగతా రోజుల్లో చర్చలు జరుగుతాయి. అనంతరం వాయిదా పడుతుంది. అప్పుడు మళ్లీ జులైలో పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం 544 మంది సభ్యులు ఉన్న ప్రస్తుత లోక్‌సభ వచ్చే ఎన్నికల నాటికి స్వరూపం మారిపోనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంట్ స్వరూపమే మారిపోనుంది. అదే టైంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇలా అన్ని విషయాల్లో వచ్చే లోక్‌సభ చాలా ప్రత్యేకతను సంతరించుకోనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన మంత్రిమండలి తొలి సమావేశం నేడు జరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఇతర సమస్యలపై ఈ భేటీలో దృష్టి పెట్టనున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -