యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా మార్చ్ 28న థియేటర్లలోకి వచ్చిన మూవీ 'మ్యాడ్ స్క్వేర్'. 2023 అక్టోబర్ 6న చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ షేక్ చేసిన 'మ్యాడ్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది ఈ మూవీ. మొదటి రోజే ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్ రాబట్టడం విశేషం. 'మ్యాడ్ స్క్వేర్' మూవీ ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 5.27 కోట్ల షేర్ రాబట్టింది.
'మ్యాడ్ స్క్వేర్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
మ్యాడ్ ఫ్రాంచైజీలో ముందుగా వచ్చిన 'మ్యాడ్' మూవీ 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, రూ. 26 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఫుల్ కావడంతో మేకర్స్ అదే జోష్ తో 'మ్యాడ్ స్క్వేర్' అనే సీక్వెల్ తో ఇప్పుడు రంగంలోకి దిగారు. ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మూవీ రిలీజ్ కి ముందే నిర్మాత నాగ వంశీ సినిమాలో కథ, లాజిక్ లు వెతకొద్దని, కేవలం నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్ కి రావాలని క్లియర్ గా చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కథ కోసం కాకుండా కేవలం కామెడీ కోసం థియేటర్లలోకి వచ్చే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇక మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు భారీగానే కలెక్షన్లను రాబట్టింది.
'మ్యాడ్ స్క్వేర్' మూవీ మొదటి రోజు ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 5.25 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఏరియాల వారీగా చూసుకుంటే... నైజాంలో రూ.2.35 కోట్లు, సీడెడ్ లో రూ. 0.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 0.37 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 0.21 కోట్లు, కృష్ణాలో రూ.028 కోట్లు, గుంటూరు రూ. 0.51 కోట్లు, నెల్లూరు రూ.0.19 కోట్లు, ఉత్తరాంధ్ర 0.62 కోట్లు... మొత్తంగా కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 5.25 కోట్ల షేర్ ఈ మూవీ మొదటి రోజే రాబట్టడం విశేషం. ఇప్పటికే నిర్మాతలు ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉన్నారు. వరల్డ్ వైడ్ ఈ సినిమా 17 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం.
యూఎస్ఏ లోనూ మ్యాడ్ నెస్
మరోవైపు యూఎస్ఏ లో 650k డాలర్ల గ్రాస్ సాధించింది అంటూ 'మ్యాడ్ స్క్వేర్' చిత్ర బృందం అఫీషియల్ గా పోస్టర్ ను రిలీజ్ చేసింది. యూఎస్ఏ లో ఈ మూవీని వి సినిమాస్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేశాయి. ఇక ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో 'మ్యాడ్ స్క్వేర్' మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. 'మ్యాడ్ స్క్వేర్'కి పోటీగా రాబిన్ హుడ్, లూసిఫర్ 2, వీరధీర శూరన్ సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, ఇవి ఏమాత్రం పోటీగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇందులో 'మ్యాడ్ స్క్వేర్' మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ వీకెండ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లకు ఎలాంటి డోకా లేదన్నారు సినీ విశ్లేషకులు.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలో నటించిన 'మ్యాడ్ స్క్వేర్' మూవీకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మించారు. సూర్యదేవర నాగ వంశీ 'మ్యాడ్ స్క్వేర్' మూవీని సమర్పించగా, హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.