Telugu breaking News: రూ. 2,75,891 కోట్లతో తెలంగాణ ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌- సభ ముందు ఉంచిన ప్రభుత్వం

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 10 Feb 2024 12:55 PM
 మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు 

ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు 


 వైద్య రంగానికి 11,500 కోట్లు కేటాయింపు 


 త్వరలో 15వేల మంది కానిస్టేబుళ్ళ నియామకాలు 


 TSPC నిర్వాహణకు 40 కోట్లు కేటాయింపు 


 ఆరు గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయింపు 


 హైదరాబాద్ మెడలో అందమైన హారంగా మూసీ నది 


 మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు 


 త్వరలోనే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ 


 ఐటీ రంగం మరింత వృద్ధి చెందేలా చర్యలు 


 ఐటీ పరిశ్రమలు ఇతర జిల్లాలకు విస్తరణ

Telangana Budget 2024: గద్దర్‌ను గౌరవించడం అంటే ప్రజాగాయకులకు దక్కిన గౌరవం

ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డును గద్దర్‌ అవార్ పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అందచేయనున్నామన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ కు ఇదే తాము ఇచ్చే నివేళి అన్నారు. గద్దర్ను గౌరవించడం అంటే తెలంగాణ సంస్తృతిని, ప్రగతిల భావజాలంతో సమాజాన్ని చైతన్య పరిచే ప్రజా కవులు, ప్రజా గాయకులను గౌరవించడమే అన్నారు. 

Telangana Budget 2024: శాంతి భద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యం 

రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అన్నారు భట్టి. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నిరాటకంగా అందించ్ అవకాశం ఉంటుంది. గత ఐదేళ్లు సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం ఎక్కువైందజి. ఎంతో మంది యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇది ఏ మాత్రం ఉపేక్షించే అంసం కాదన్నారు. 
అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా మన పోలీసులు, ఆబ్కారీ అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యచరణకు నిదర్శనం అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధులను సిబ్బందిని కేటాయించాం. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాట ఉత్పన్న కాకూడదన్‌నారు. ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతను కాపాడుతున్నామన్నారు. ఈ నెల 4 వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంల హుక్కా బార్లను కూడా నిషేదించామన్నారు. 
ఎంతో కాలంగాణ పెండింగ్‌లో ఉన్న నూతన హైకోర్టు భవన సముదాయానికివంద ఎకరాల స్థలాన్ని కేటాయమైంది. న్యాయవ్యవస్థ పటిష్ఠతకు మేం తీసుకుంటున్న చర్యతో దేశ మొత్తం తెలంగాణ వైపు చూసతుడటంతో సందేహం లేదు. 

Telangana Budget 2024: ఓట్‌ ఆన్ అకౌంట్‌ ప్రవేశ పెట్టడానికి కారణమేంటీ?

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్‌ ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గా ప్రవేశ పెట్టడం అయిష్టంగా ఉందన్నారు భట్టి. కేంద్ర ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకువాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులు సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉపయోగించుకోవాలనే స్పష్టత ఉంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్థి స్థాయి బడ్జెట్‌లో వివిధ రంగావారిగా కేటాయింపులు జరిగినప్పుడే, మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతామన్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడే రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించామన్నారు. 

Telangana Budget 2024: ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం 

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశ పెడతుందన్నారు. ఈ బడ్జెట్ లక్ష్యం ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం సమగ్రంగా అభివద్ధి చేయడమే అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా ఆరు గ్యారంటీలను తూజా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీనులను అభివృద్ధి చేస్తామన్నారు. 

Telangana Budget 2024: మూడే ప్రధానమైన అంశాలు 

నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అత్యంత ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధిస్తామన్నారు. 

Telangana Budget 2024: ఖజానా దివాలా తీయించారు

గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించారు. ప్రణాళిక లేకుండా, హేతుబద్దత లేకుండా వారు చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాళ్లుగా మారాయి. అయితే ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో, సహేతుకమైన కార్యచరణతో ఈ సవాళ్లను అధిగమిస్తామన్నారు. 

Telangana Budget 2024: దుబారా తగ్గిస్తాం 

దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు భట్టి. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్ధకమైన ఆస్తులు పెంచుకుటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయడం మా విధానం కాదన్నారు. కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందడం, వారు సంతోషంగా ఉండటం మాత్రమే మా లక్ష్యం అన్నారు. దీనికి అనుగుణంగానే తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశామన్నారు. 

2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కల ఖర్చు, మిగులు ఇదే

2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 2,04,523 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రెవెన్యూ మిగులు 5,944 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు 32,557 కోట్ల రూపాయలు 

2023-24 బడ్జెట్‌లో సవరించిన అంచనాలు

సవరించిన అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరానికి చేసిన మొత్తం అంచనా వ్యయం 2,24,625 కోట్ల రూపాయలు, ఇందులో రెవెన్యూ వ్యయం 24,178 కోట్లు, సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతా మిగులు 9,031 కోట్ల రూపాయలు, ద్రవ్యలోటు 33,786 కోట్ల రూపాయలు 

ఆరు గ్యారంటీల అమలుకు కేటాయించిన నిధులు రూ. 53196 కోట్లు 

ఆరు గ్యారంటీలు- రూ. 53196 కోట్లు 


ఐటీ శాఖ - రూ. 774 కోట్లు 


పరిశ్రమల శాఖ- రూ. 2543 కోట్లు 


మున్సిపల్ శాఖ - రూ. 11692 కోట్లు


పంచాయతీ రాజ్‌ - రూ.  40080 కోట్లు 


వ్యవసాయ శాఖ - రూ. 19746 కోట్లు 


ఎస్టీ ఎస్సీ గురుకుల పాఠశాలల కోసం - రూ.1250కోట్లు  


ఎస్సీ సంక్షేమం - రూ. 21874


ఎస్టీ సంక్షేమం - రూ. 13013 కోట్లు 


బీసీ సంక్షేమం -రూ. 8000 కోట్లు 


వైద్య రంగం - రూ. 11500 కోట్లు 


 


 

రూ. 2,75,891 కోట్లతో తెలంగాణ ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌

2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు


 రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు, 


మూలధన వ్యయం 29,669 కోట్లు


 2024-25 సంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్

దళిత బంధుకు పైసా కూడా ఖర్చు పెట్టలేదు: భట్టి విక్రమార్క

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం తప్పులు తడకగా ఉంది. దళిత బంధు లాంటి పథకానికి రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. ఇలా చాలా పథకాలకు పైసా ఖర్చు పెట్టకుండా ఖర్చులు చూపించారు. అన్నింటినీ బడ్జెట్‌లో చూపించారే తప్ప ఎక్కడా ఖర్చు పెట్టలేదు. వాటన్నింటికీ పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నాం. 

ఆర్థిక స్థితి దారుణంగా ఉంది; భట్టి విక్రమార్క

గత పాలకుల నిర్లక్ష్యంతో ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఆర్థిక కష్టాలు. ప్రతినెల 1న ఉద్యోగులకు పింఛన్‌దారులకు జీతాలు ఇవ్వలేదని దుస్థితి నెలకొంది. ఉద్యోగులు బ్యాంకర్ల వద్ద ఇబ్బంది పడుతున్నారు. ఇలా విధ్వంసంతో సాగిన పాలనకు ప్రజలు చరమ గీతం పాడారు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం 

అందరం కోసం మనమందరం

తెలంగాణ సమాజం మార్పు కోరుకుంది. అందరం కోసం మనమందరం అనే స్ఫూర్తితో ముందుకెళ్తాం. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి విక్రమార్క 

ఎంతటి త్యాగాలకైనా సిద్ధం: భట్టి విక్రమార్క 

ప్రజలకు మంచి పాలన అందించేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. ప్రజా పాలన అందిస్తూ ప్రజలను ఆర్థికంగా బలోపేతం  చేయాలని సంకల్పించామన్నారు. 

తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న మంత్రులు

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశ పెట్టారు. శాసన మండలిలో బడ్జెట్‌ను ఐటీ మినిస్టర్‌ శ్రీధర్ బాబు చదివి వినిపిస్తున్నారు. 

తెలంగాణ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం- హామీల అమలుపై ఫోకస్ అన్న భట్టి 

తెలంగాణ అసెంబ్లీ కమీటీ హాల్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. మూడు నెలల కోసం రూపొందించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చించి దాన్ని ఆమోదించింది. ఇప్పుడు ఈ బడ్జెట్‌ను మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో ప్రవేశ పెట్టనున్నారు. శాసన సభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ చదవనున్నారు.   
2024-25 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 3 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారని సమాచారం. ఆరు గ్యారంటీలతోపాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి పెట్టి కేటాయింపులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. 
ఇవాళ ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై సోమవారం ఉభయ సభల్లో చర్చిస్తారు. అయితే ఇది తాత్కాలిక బడ్జెట్ అని ఇందులో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండబోవంటున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ జూన్ లో ప్రవేశ పెట్టనున్నారు.
బడ్జెట్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క... బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయన్నారు. ఎన్నికల టైంలో పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఆస్తులు.. అప్పులతో పాటు .. కేంద్రం నుంచి వచ్చే ఆదాయంపై  కూడా సభలో స్పందిస్తానన్నారు. 

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెట్‌ ప్రాజెక్టుతో అనేక ప్రయోజనాలు: గవర్నర్

ఇప్పటి వరకు మూసీ నది నిర్లక్ష్యానికి గురైంది. ప్రజలకు ఈ నది అన్ని విధాలుగా ఉపయోగపడేలా చేయడమే మన లక్ష్యం. నా ప్రభుత్వం పెద్ద ఎత్తున మూసీ రివర్‌ ఫ్రంట్ అభివృద్ధి పనులను చేపట్టనుది. మూసి మరొకసారి హైదరాబాద్‌ జీవనాడిగా మారనుంది. దాని చుట్టూ ఉన్న మొత్తం పట్టణ ల్యాండ్ స్కేప్‌ పునరుజ్జీవింప చేయడమే లక్ష్యం.నగర తూర్పు, పశ్చిమ భాగాలను అనుసంధానించే రవాణా నెట్‌వర్క్‌ను స్వచ్ఛమైన నీటిని, రివర్ ఫ్రంట్‌ సుందరీకరణ  వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో అంతర్భాగం, పీపుల్స్ ప్లాజా పాదచారుల జోన్‌లు హాకర్ ప్రాంతాలు, నగరమంతటా పచ్చని ప్రదేశాలు మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు కానున్నాయి. నగరంలోని పురాతన , వారసత్వ ప్రాంతాల పునరుజ్జీవనం వల్ల ప్రజలకు మరింతగా చేరువవుతాయి. ఈ విషయంపై తగు చర్యలు చేపట్టడానికి ఉత్తమ పద్దతులను అవలంభించడానికి ఖ్యాతి గాంచిన జాతీయ అంతర్జాతియ నమూనాలను అధ్యయనం చేస్తున్నాం. ఇంతకు ముందు చేయని విధంగా పెద్ద ఎత్తున సకాలంలో పర్యావరణ ఆర్థిక మార్పునకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెట్‌ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. 

క్రీడా రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఎదిగేలా చేయడమే లక్ష్యం: గవర్నర్

ఆధునిక క్రీడా సదుపాయాలను కల్పించి, స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ వేదికలపై రాణిచండానికి ఔత్సాహిక అథ్లెట్లకు ఒక వేదికను ఏర్పాటు చేసే ప్రణాళికలను రూపొందిస్తాం. ఈ చర్యల ద్వారా ఔత్సాహిక క్రీడాకారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి, తెలంగాణని క్రీడా రంగంలో అగ్రగామిగా ఎదిగేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

నైపుణ్య విశ్వవిద్యాలయం, క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ; గవర్నర్

నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటులో పెట్టుబపడి పెట్టి, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా పోటీ ప్రపంచంలో యువత రాణించడానికి అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేస్తాం. తద్వారా క్రీడలు మన సంస్కృతిలో భాగమయ్యేట్టు చేస్తాం. క్రీడారంగ సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న ఈ చర్యలు మా నిబద్ధతకు తార్కాణం. ఈ చర్యలు ద్వారా తెలంగాణలోని యువత ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారు. 

త్వరలోనే రాష్ట్రంలో కులగణన

వివిధ కులాలు ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సామాజిక విద్యాపరమైన ఆర్థిక ఉద్యోగ రాజకీయ అవకాశాలను అంచనా వేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కుటుంబాన్నింటినీ సర్వే చేయడం ద్వారా మన ప్రభుత్వం కులగణను చేపట్టాలని నిర్ణయించింది. 

వివక్ష, అణచివేతకు గురైన అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తాం: గవర్నర్‌

సమాజంలోని వివక్ష, అణచివేతకు గురైన అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తాం... సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలలో భాగంగా రైతులు విద్యార్థులు, ఉద్యోగులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ , పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అమర వీరుల కుటుంబాలు, ఇతర అవసరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. 

బడ్జెట్‌ మనం ఆశించిన అభివృద్ధికి చోదకంగా ఉండాలి: గవర్నర్‌

మనం ఆశిస్తున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ.. ప్రాథమిక హక్కులు పరిరక్షిస్తూ అంబేడ్కర్ స్ఫూర్తి మన కార్యచరమకు మార్గదర్శకంగా ఉంటుంది. బడ్జెట్‌ ప్రక్రియ అనేది కేవలం వార్షిక మొక్కుబడి కాదని గుర్తించుకోవాలి. ఇది మనం ఆశించిన అభివృద్ధికి చోదకంగా ఉంటూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమతో ఎన్నుకున్న ప్రజానీకపు ఆకాంక్షలను ప్రతిఫలింప జేస్తుంది. 

బడ్జెట్‌లో పెట్టే ప్రతి రూపాయి తెలంగాణ సంక్షేమం కోసమే: గవర్నర్‌

బడ్జెట్‌లోని సంక్లిష్టతను కొత్త శాసనసభ పరిళీస్తున్న సందర్భంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బడ్జెట్‌ ప్రక్రియ ప్రాధాన్యతను చెప్పాలనుకుంటున్నాను. బడ్జెట్ కేవలం ఒక ఆర్థిక పత్రం మాత్రమే కాదు.. మనం కోరుకున్న ఉమ్మడి భవిష్యత్‌కి ఒక నమూనా. ఇది మన ప్రజల ఆకాంక్షలను అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక, బడ్జెట్‌లో వరులను సమర్థవంతంగా కేటాయించి ఖర్చు చేసే ప్రతి రూపాయి తెలంగాణ సంక్షేమం పురోగతి దోహదపడేలా చేయడాన్ని నా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

త్వరలోనే మరో రెండు పథకాలు అమలు : గవర్నర్‌

పథకాలన్నీ అర్హులైన ప్రజలందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కమిట్‌మెంట్‌తో ప్రభుత్వం ఉంది. ఇప్పటిక రెండు పథకాలను అమలు చేస్తున్నాం. త్వరలోనే మరో రెండు గ్యారెంటీలను అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. 

ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుంది: గవర్నర్

కాలోజీ కామెంట్స్‌తో తన ప్రసంగాన్ని ప్రారంభించిన తెలంగాణ గవర్నర్‌.. ప్రభుత్వ ఆలోచనలు సభ ముందు పెట్టారు. ఒకప్పుడు ప్రజాభవన్‌కు అనుమతి లేని ప్రజలకు నేరుగా తమ సమస్యలు చెప్పుకునేలా సిద్ధం చేశామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని అన్నారు. 

అన్నను చంపి సెల్ఫీ తీసుకున్న తమ్ముడు- హైదరాబాద్‌లో ఘాతుకం

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో దారుణం జరిగింది. శాస్త్రీపురంలో అన్నను తమ్ముడు చంపేశాడు. కత్తితో గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. హత్యకు గురై వ్యక్తి అబ్దుల్ రహ్మాన్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన హంతకుడు. చంపేసిన అన్న డెడ్‌బాడీతో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. 

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై విచారణ

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీలో విచారణ జరగనుంది. ఈ విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీనిపై స్పీకర్ విచారించి, నిర్ణయం తీసుకోనున్నారు

నిరుద్యోగ సంఘాల నేతల అరెస్టు- అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చర్యలు

అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటారన్న అనుమానంతో నిరుద్యోగ సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కొన్ని రోజులుల జీవో నెంబర్‌ 46 రద్దు చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల వద్ద ఏమైనా ధర్నా, ముట్టడికి ప్లాన్ చేస్తున్నారన్న అనుమానంతో చర్యలు తీసుకున్నారు. 

ఆర్టీసీ బస్‌లో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ..

మొదటి రోజు అసెంబ్లీ కి ఆర్టీసీ బస్ లో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ..


నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి వచ్చిన వెంకట్ ..


ఉచిత బస్ ప్రయాణం పై  మహిళలతో మాట్లాడిన వారి అభిప్రాయాలు తెలుసుకున్న వెంకట్.

హైదరాబాద్‌లో దారుణం- ప్రైవేట్ పార్ట్స్ కోసి బీజేపీ లీడర్‌ హత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి బీజేపీ లీడర్ దారుణహత్యకు గురయ్యారు.  యూసుఫ్ గూడా L.N.నగర్‌లోని సింగోటం రాము అనే వ్యక్తిని దుండగులు కిరాతకంగా చంపేశారు.  ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతుపై కత్తితో పొడిచి హింసించి ప్రాణాలు తీశారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ పేరుతో స్థానికంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు సింగోటం రాములు. సోషల్ సర్వీసెస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. 
రాములుది పాలమూరు జిల్లా  కొల్లాపూర్ సింగోటం, అక్కడే సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీ తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగర్ కర్నూల్ జిల్లా నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఎంపీ టికెట్ ఆశిస్తున్న రాములు ఆ ప్రయత్నాల్లో ఉండగానే దుండగులు హత్య చేశారు. రాత్రి పదకొండు గంటల సమయంలో  10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసినట్లుగాకాలనీ వాసులు చెబుతున్నారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్‌ టీంలను రప్పించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రాములు బాడీని పోస్టమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

హైదరాబాద్‌ పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు - వరవరరావు అల్లుడి నివాసాల్లో తనిఖీలు 

వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో ఈ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎల్బీనగర్లో రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Background

Latest Telugu breaking News: నేటి (ఫిబ్రవరి 8 గురువారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 నిమిషాలకు గవర్నర్ తమిళిసై ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత ఎమ్మెల్యే హోదాలో సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటికే నీటి పారుదల ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో ఫైట్ జరుగుతుంది. అది సభపై కూడా ప్రభావం చూపుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. 


కేంద్రానికి ప్రాజెక్టుల నిర్వహణ అప్పగించడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ గత హయంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ నిలదీసేందుకు సిద్దమైంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న టైంలో ఈ సమావేశాలు ఊహించనంత హాట్‌గా జరగొచ్చని అంటున్నారు. 


ఈ సమావేశాల్లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సుమారు వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ఒకరోజు, ధన్యవాదాల తీర్మానంపై చర్చకు ఇంకొక రోజు పోతుంది. తర్వాత బడ్జెట్ పెట్టడానికి ఒకరోజు... దానిపై చర్చకు రెండు రోజుల సమయం కేటాయించే ఛాన్స్ ఉంది. తర్వాత వివిధ విభాగాలపై శ్వేత పత్రాలు రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వాటి కోసం మిగిలిన రోజులు కేటాయించనున్నారు. 


బడ్జెట్ సమావేశాల (Telangana Budget Session 2024) నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసన సభ మీటింగ్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.


శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు త్వరితగతిన అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకునేలా శాసన సభ వ్యవహారాల మంత్రి తోడ్పాటు అందించాలని గుత్తా కోరారు. భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు చేపట్టాలని సూచించారు.


ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పట్లు ఆయా విభాగాల అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అసెంబ్లీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మండలి, శాసన సభకు ఎన్నికైన నూతన సభ్యులకి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలన్నారు. 


శాసన సభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు సభ్యులకు అందించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కు సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని, గతంలో ప్రోటోకాల్ విషయంలో తాను కూడా బాధితుడిని అని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేసుకున్నారు. 


మండలిని అసెంబ్లీ ప్రాంగణంలో కు త్వరితగతిన షిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కారం చెయ్యాలని చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, భద్రతపై సమక్షలో.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణ రావు, డీజీపీ రవి గుప్త, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.