Meghana Raj Plays A Key Role In Ram Charan RC16 Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు (Buchibabu) కాంబోలో లేటెస్ట్ మూవీ 'RC16' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా.. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా గురించి అప్ డేట్స్‌పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న క్రమంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
కీలక రోల్‌లో కన్నడ దివంగత నటుడి సతీమణి?
ఈ సినిమాలో కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా (Chiranjeevi Sarja) సతీమణి, నటి మేఘనా రాజ్ (Meghana Raj) భాగమైనట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓ కీలక పాత్ర కోసం మూవీ టీం ఆమెను సంప్రదించినట్లుగా.. రోల్ నచ్చడంతో మేఘనా సైతం ఇందులో నటించేందుకు అంగీకరించారనే టాక్ వినిపిస్తుండగా అది నిజం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె షూటింగ్‌లో సైతం భాగమయ్యారని సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ కాగా.. ఈ వార్తల్లో నిజం లేదని.. ఇది ఫేక్ న్యూస్ అని సమాచారం.
మేఘన రాజ్ బాలనటిగానే కాకుండా.. హీరోయిన్‌గానూ పలు సినిమాల్లో నటించారు. ఆమె తల్లిదండ్రులు సుందర్ రాజ్, ప్రమీల జోషాయ్ కన్నడ నటీనటులు. చిరంజీవి సర్జాతో వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. కరోనా టైంలో చిరంజీవి సర్జా గుండెపోటుతో మృతి చెందారు. భర్త మరణం తర్వాత మేఘనా తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. నటనంటే తనకెంతో ఇష్టమని.. అది తన రక్తంలోనే ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం చెప్పారు. తన భర్త చిరంజీవి సర్జా తనకు ఇష్టమైనదేదీ వదులుకోవద్దని చెప్పారని.. అందుకే తాను ఉన్నంతవరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానని అన్నారు.
Also Read: 'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
భారీ బడ్జెట్‌తో..
మరోవైపు, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో 'RC16' మూవీ రూపొందుతుండగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను మైసూర్‌లో పూర్తి చేశారు. హైదరాబాద్‌లో ఫేమస్ భూత్ బంగ్లాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ తెరకెక్కుతుండగా.. రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన రోల్ అల్టిమేట్‌గా ఉండబోతోందని సినీ వర్గాల టాక్. తర్వాత షెడ్యూల్ దేశ రాజధాని ఢిల్లీలోని ఐకానిక్ ప్లేసెస్‌లో చేయనున్నట్లు సమాచారం.
ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. సినిమాకు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే 2 పాటలు పూర్తైనట్లు ఇటీవలే తెలిపారు. మూవీకి 'పెద్ది' అనే టైటిల్ పెడతారని ప్రచారం సాగుతుండగా.. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా టైటిల్‌ను ఈ నెల 27న అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.