Kannaappa Mahadeva Shastri Song Release Date: డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa). ఈ మూవీ నుంచి ఇప్పటికే 'శివ శివ శంకరా' పాటతో పాటు ఇటీవలే 'సగమే, చెరిసగమే ఇక నువ్వూ నేను' అనే లవ్ సాంగ్ రిలీజ్ కాగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, థర్డ్ సింగిల్ అప్ డేట్ వచ్చేసింది. 


మహాదేవశాస్త్రి పరిచయ గీతం..


ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) మహాదేవశాస్త్రి పాత్రలో నటిస్తుండగా.. ఆయన రోల్ పరిచయం గీతంను ఈ నెల 19న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేయనున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మిస్టర్ స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన పాటలు ఇప్పటికే శ్రోతలను అలరించాయి. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా.మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.






Also Read: 'కోర్ట్' సక్సెస్ జోష్‌లో కొత్త మూవీ రిలీజ్‌కు ప్రియదర్శి రెడీ - ఈ సమ్మర్‌లో నవ్వులు పంచేందుకు 'సారంగపాణి' వచ్చేస్తున్నాడు..


ఫస్ట్ రెండు సింగిల్స్ అదుర్స్


భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'కన్నప్ప' మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు సింగిల్స్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. 'శివ శివ శంకరా.. సాంబ శివ శంకరా.. హర హర శంకరా.. నీలగంధరా..' అంటూ సాగే లిరిక్స్ ఆద్యంతం ఆకట్టుకోగా.. యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అటు సోషల్ మీడియాలోనూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే, రెండో పాట 'లవ్ సాంగ్'ను ఇటీవలే విడుదల చేయగా.. మంచు విష్ణు, ప్రీతి ముకుందన్‌ల అద్భుతమైన కెమిస్ట్రీతో వచ్చిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ బాణీలు సమకూర్చారు. 


కన్నప్పగా మంచువిష్ణు..


మూవీలో కన్నప్పగా మంచు విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ కనిపించనున్నారు. మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించడం సహా మహాదేవశాస్త్రి పాత్రలో నటిస్తున్నారు. ప్రీతి ముకుందన్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల లాంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే విష్ణు తనయుడు ఆవ్రామ్ తెరంగేట్రం చేయనున్నాడు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.


ఏడేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నట్లు మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా మూవీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక.. ఈ మూవీ ఓటీటీపై ఇటీవల స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ సంస్థలకు తన చిత్రాన్ని చూపించనని అన్నారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే పెద్ద రిస్క్‌గా భావిస్తున్నానని.. తన మార్కెటింగ్ టెక్నిక్స్ తనకు ఉంటాయని కామెంట్ చేశారు.