Breaking News: నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ఫొటోలు ఇవే

Andhra Pradesh And Telangana Breaking News: ఒలింపిక్స్ అప్‌డేట్స్‌, బంగ్లాదేశ్‌లో పరిణామాలతోపాటు హాట్ హాట్‌గా సాగుతున్న తెలుగు రాష్ట్రాల రాజకీయల అప్‌డేట్స్‌ను తక్షణం ఇక్కడ తెలుసుకోండి.

ABP Desam Last Updated: 08 Aug 2024 02:41 PM
Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం- సీనియర్ అధికారులకు ప్రమోషన్లు

Telangana Police: డీజీపీ కేరడ్‌లోకి శివధర్ రెడ్డి , సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, అభిలాష బిస్తీ ఉంటే... డీజీ క్యాడర్‌కు హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డిని ప్రమోట్ చేశారు. ఇంటలిజెన్స్ డీజీగా శివధర్  రెడ్డి, సీఐడీ డీజీగా  శిఖా గోయల్, జైల్స్ డీజీగా సౌమ్య మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్తీ పోస్టింగ్‌లు ఇచ్చారు. 

Naga Chaitanya - Sobhita Dhulipala:నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ఫొటోలు ఇవే 

Naga Chaitanya - Sobhita Dhulipala: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైత‌న్య‌, హీరోయిన్ శోభితా దూళిపాళ్ల నిశ్చితార్థం ఇవాళ సింపుల్‌గా జరిగింది. ఇవాళ అక్కినేని కుటుంబ సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది.

Pawan Kalyan: ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లిన పవన్ కల్యాణ్

Andhra Pradesh: చిత్తూరులో ఊళ్లపై పడి పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. వాటిని అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులు అవసరం ఉంది. అవి కర్ణాటకలో ఉన్నాయి. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వాటిని రప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటక వెళ్లారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. 

Chandra Babu: టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం- ఎమ్మెల్సీ ఉపఎన్నిక అభ్యర్థి ఖరారు అయ్యే ఛాన్స్

Telugu Desam Party: తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో సమావేశమైంది. ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు  తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో నామినటెడ్ పోస్టుల భర్తీతోపాటు 2029 ఎన్నికలే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నిక విషయం కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. 

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త కిడ్నాప్

Andhra Pradesh: పల్నాడు  జిల్లా బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైసీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్ అయ్యారు. ఆటోలో వెజిటెబుల్స్ అమ్ముకొని వస్తున్న ఆయన్ని బొలెరో వాహనంతో వెంబడించి కిడ్నాప్ చేశారు. 

Background

Andhra Pradesh Telangana Breaking News: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అధికార ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బలం లేకపోయినా బరిలోకి దిగుతామంటున్నా కూటమిని ఎదుర్కొనేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. గత వారం రోజుల నుంచి విశాఖ ప్రజాప్రతినిధులతో జగన్ తన నివాసంలో సమావేశమవుతున్నారు.


పార్టీకి అండగా ఉండాలని.. బొత్స సత్యనారాయణ విజయం కోసం శ్రమించాలని చెబుతున్నారు. అధికార కూటమి చేసే ప్రలోభాలకు లొంగవద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆరోపణలతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. చాలా వేగంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు జగన్. ఐదేళ్ల తర్వాత కచ్చితంగా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటున్నారు. 


ఎన్ని కోట్లు ఇచ్చేందుకైనా అధికార పార్టీ సిద్ధమువుతుందని అలాంటి ప్రలోభాలకు లొంగితే ప్రజలు చీదరించుకుంటారని చెబుతున్నారు జగన్. వైసీపీ విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తోందని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా విలువలే కొలమానంగా ఉంటుందని అంటున్నారు. విలువలకు తిలోదకాలు ఇచ్చేసిన చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎన్ని కుయుక్తులైనా పన్నుతారని విమర్శించారు. జిల్లాలో ఆరు వందలకుపైగా ప్రాంతాల్లో వైసీపీ లీడర్లే ఉన్నారని... కూటమికి కనీసం 200 మంది కూడా లేరని అన్నారు. అయినా పోటీ చేస్తాం గెలుస్తామంటూ చెప్పడం వెనుక దురుద్దేశాన్ని అంతా గమనించాలన్నారు. 


సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ  పదిమంది ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. చంద్రబాబుకు అలాంటి ఆలోచనే లేదన్నారు. అలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నామని కచ్చితంగా జాగ్రత్తాగ ఉండాలని సూచించారు. 2014 ఎన్నికల్లో మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను నిలువునా ముంచేశారని ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నారని విమర్శించారు. ఇంటింటికీ తిరిగి డబ్బులు మూటలతో ఇస్తామని చెప్పి ఇప్పుడు ఖజానాలో డబ్బుల్లేవని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనలా అబద్దాలు చెప్పి ఉంటే కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వచ్చేదని అన్నారు. అలా అబద్దాలు చెప్పి అధికారంలోకి వస్తే నేతలు ప్రజల్లో తిరగగలరా అని ప్రశ్నించారు.


కార్యకర్తలకు, నేతలకు అలాంటి తలవొంపులు వద్దనే తాను చేయలేని హామీలు ఇవ్వలేదని చేయడానికి వీలున్నవే ఇచ్చామన్నారు జగన్. పది శాతం మంది ప్రజలు మాత్రం చంద్రబాబు మాయమాటలు నమ్మి కూటమికి ఓటు వేశారని ఇప్పుడు అసలు స్వరూపం బయటపడుతుందని అన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నామని అన్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.