Breaking News: బంగ్లాదేశ్‌లో అల్లర్లు, 440కి చేరిన మృతుల సంఖ్య

Andhra Pradesh And Telangana Breaking News: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు, ఒలింపిక్స్ అప్‌డేట్స్‌తోపాటు మరిన్ని వార్తలు తక్షణం తెలుసుకునేందుకు ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి

ABP Desam Last Updated: 06 Aug 2024 04:38 PM
Bangladesh Crisis LIVE Updates: బంగ్లాదేశ్‌లో అల్లర్లు, 440కి చేరిన మృతుల సంఖ్య

బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు విధ్వంసం, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లతో మొత్తం 440 మంది చనిపోయారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా అనంతరం జరిగిన అల్లర్లు, విధ్వంస ఘటనల్లో దాదాపు వంద మంది వరకు మృతిచెందినట్లు సమాచారం. మరోవైపు సైన్యం దేశంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

Bangladesh Crisis LIVE Updates: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు, అధ్యక్షుడు కీలక నిర్ణయం

Bangladesh Crisis LIVE Updates: బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇదివరకే షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చేశారు. దేశంలో ఆందోళనకారుల విధ్వంసకాండ కొనసాగుతుండగా, మరోవైపు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. దేశంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారని AFP రిపోర్ట్ చేసింది. 

Bangladesh Crisis: చాలా ఆందోళన కలిగించే అంశం- బంగ్లాదేశ్‌ సంక్షోభంపై పార్లమెంట్‌లో జైశంకర్‌ కీలక ప్రకటన

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో దిగజారుతున్న పరిస్థితులకు సంబంధించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్‌... బంగ్లాదేశ్‌లో పరిస్థితి గమనిస్తున్నామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో 2024 జనవరిలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందన్నారు. జూన్ నుంచి విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యాయని వివరించారు. 


ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతులపై దాడులు చేశారని పేర్కొన్నారు. జులైలో నిరసనలు హింసాత్కంగా మారాయన్నారు. చాలా ప్రాంతాల్లో మైనారిటీ దుకాణాలు, దేవాలయాలపై దాడులు జరగాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. 

Bangladesh Crisis: బంగ్లాదేశ్ పరిస్థితులతో బిహార్ పోలీసులు అలర్ట్

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలతో బిహార్ పోలీస్లు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వస్తువులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు చెప్పాలని హెడ్‌క్వార్టర్స్ ఉత్తర్వులు జారీ చేసింది. విషయాన్ని వెంటనే పోలీసు సూపరింటెండెంట్ లేదా సంబంధిత జిల్లా అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్లు 14432 మరియు 112 కూడా ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు. .

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌ పరిస్థితులపై పార్లమెంట్‌లో చర్చే లేదు: కేంద్రం 

Bangladesh Crisis: కేంద్ర ప్రభుత్వం మాత్రం అఖిలపక్షంలో బంగ్లాదేశ్‌ ఇష్యూపై పార్లమెంట్‌లో చర్చించాలనే అంశం ప్రస్తావనకు రాలేదని చెబుతోంది. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని అడగలేదని అంటోంది. అందుకే పార్లమెంట్‌లో దీనిపై చర్చించేది లేదని తేల్చి చెప్పేసింది. 

Bangladesh Crisis:బంగ్లాదేశ్‌ పరిస్థితిని పార్లమెంటులో చర్చిస్తాం: కాంగ్రెస్ 

Bangladesh Crisis:బంగ్లాదేశ్‌లో దిగజారుతున్న పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈ మేరకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పెద్దల సభ అయిన రాజ్యసభలో చర్చకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

Bangladesh Crisis: తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి ముహమ్మద్ యూనస్ అంగీకారం 

Bangladesh Crisis:బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అంగీకరించారని సమాచారం. విద్యార్థులపై ప్రభుత్వం అతిగా ప్రదర్శించిందని అందుకు మూల్యం చెల్లించుకున్నారని యూనస్ అన్నారు. విద్యార్థులు చేసిన ఈ త్యాగం తన బాధ్యతను మరింత పెంచిందని అభిప్రాయపడ్డారు. 

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఆసిఫాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామ సమీపంలో గల వైరాగడే పాండు అనే రైతు వ్యవసాయ చెనులో పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. దీంతో రైతు పాండు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ అధికారులు పాదముద్రలను పరిశీలించి,అవి పెద్దపులి పాదముద్రలేనని నిర్దారించారు. గోవింద్ పూర్ తో పాటు గుండి సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు తమ వ్యవసాయ పనుల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు పనులను పూర్తీ చేసుకొని త్వరగా ఇంటికి వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే అక్కడి నుంచి పులి ఎటువైపు వెళ్లిందననేది తెలియాల్సి ఉంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పులిజాడ తెలిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 

Background

Breaking News: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే బోర్డర్‌లో  సెక్యూరిటీని టైట్ చేసిన భారత్... రాజకీయ వ్యూహాలపై సమాలోచనలు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు అఖిలపక్షంతో సమావేశమైంది. బంగ్లాదేశ్‌లో పరిణాలా,షేక్‌ హసీనా భారత్‌లోకి రావడం వంటి విషయాలపై కేంద్రమంత్రి జైశంకర్‌ అఖిలపక్షానికి వివరించనున్నారు. 
బంగ్లాదేశ్ అంశంపై పార్లమెంటు హాలులో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, నిన్నటి పరిణామాలపై పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమాచారం అందించారు. ఈ భేటీలో హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. 
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా చేసి భారత్‌కు రావడంతోనే మోదీ హైలెవల్‌ కమిటీ సమావేశమయ్యారు. భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అయింది. బంగ్లాదేశ్‌లో పరిణామాలతో దేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించింది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, నిర్మలా సీతారామన్‌ కూడా ఉన్నారు. 
సరిహద్దుల్లోని సైన్యాన్ని అప్రమత్తం చేసింది కేంద్రం. సోమవారం 4,096 కి.మీ పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అన్ని BSF యూనిట్లకు 'హై అలర్ట్' ప్రకటించింది. చొరబాట్లు నియంత్రించేందుకు గస్తీని ముమ్మరం చేసింది సైన్యం. 
బంగ్లాదేశ్‌కు సరిహద్దుగా ఉన్న మేఘాలయలో ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టన్ టైన్‌సాంగ్ తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది, మేఘాలయ పోలీసులతో అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
బంగ్లాదేశ్‌లో పరిణామాలతో దేశం విడిచి వచ్చి భారత్‌లో ఉన్న షేక్‌ హసీనాతో NSA అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో హసీనాను కలిశారు. ఈ సమావేశంలో  సీనియర్ ఆర్మీ అధికారులు కూడా ఉన్నారు. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.