Breaking News: సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ- మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
Andhra Pradesh And Telangana Breaking News: తెలుగు రాష్ట్రాల న్యూస్ అప్‌డేట్స్ నుంచి అంతరిక్షం వరకు జరిగే ప్రతి విషయం ఇక్కడ చూసుకోవచ్చు.
Harish Rao: సీతారామ ప్రాజెక్టు క్రెడిటి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు పోటీ పడుతున్నాని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్‌రావు. ఇష్టపూర్వకంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు హరీష్‌రావు. ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతో సీతారామ అని పేరు పెట్టారని తెలిపారు. ఇప్పుడు అధికారం చేతులు మారడంతో ప్రారంభోత్సవం చేసే అవకాశం కాంగ్రెస్‌కు వచ్చిందన్నారు. కానీ తామే ప్రాజెక్టు కట్టినట్టు కాంగ్రెస్ నేతలు హడావుడి చేస్తున్నారని అన్నారు. రిబ్బన్ కటింగ్ చేసే ఆవకాశం వచ్చిందని ప్రాజెక్టు తామే కట్టామని కాంగ్రెస్ మంత్రులు కటింగ్ ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. ఈ ఏడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయిందంటున్న కాంగ్రెస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు.
BRS MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణలో కవిత వేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది.
Medchal : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లీ గ్రామంలో దారుణం జరిగింది. గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో తండ్రి ఇద్దరు కుమార్తెలను రైలు ఢీ కొట్టింది. ముగ్గురు కూడా స్పాట్‌లోనే చనిపోయారు. అతను మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ అదే స్టేషన్ పరిధఇలో రైల్వే ట్రాక్ చెకింగ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తన ఇద్దరు కుమార్తెలను స్టేషన్‌కు తీసుకొచ్చాడు. ఆయన పని చేసుకుంటుండగా ఇద్దరూ ట్రాక్‌పై ఆడుకుంటున్నారు. రైలు వస్తుండటాన్ని గమనించిన కృష్ణ వారిని రక్షించబోయి మృతి చెందారు.
Tirupati: రేణిగుంట బీసీ హాస్టల్‌లో 15మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వాంతులు విరోచనాలు కావడంతో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరారు. విషయం తెలుసుకున్న జిల్లా హెల్త్ ఆఫీసర్ డిహెచ్ఓ శ్రీహరి విద్యార్థులను పరామర్శించి ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం డిహెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ బిసి హాస్టల్‌లోని 46 మంది విద్యార్థుల్లో 15 మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరారు. వారిలో మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని తిరుపతి రుయాకి తరలించామని తెలిపారు..
హాస్టల్‌లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులు పూర్తిగా కోలుకునేంతవరకు వైద్య సదుపాయందగ్గరుండి పర్యవేక్షిస్తానన్నారు. బీసీ హాస్టల్‌లోని మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేసి భోజనం అన్నింటినీ డాక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు.
Vizag MLC Elections: విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఎన్డీఏ బరిలో దిగడం ఖాయమైంది. కూటమి తరఫున బైరా దిలీప్ చక్రవర్తిని బరిలో దింపుతోంది. ఎప్పటి నుంచో ఆయన పేరు వినిపిస్తోంది. ఇప్పుడు దాదాపు ఖరారు అయినట్టు కూటమి వర్గాలు చెబుతున్నాయి.
Background
Andhra Pradesh Telangana Breaking News: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి స్పాట్‌లోనే చనిపోయాడు. మరికొందరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లి మండలం చిన్న వరంపాడు వద్ద ప్రమాదం జరిగింది. పోలుసులు కేసు నమోదు చేసు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ బెంగుళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న టైంలో అటుగా వెళ్తున్న వారిని ఢీ కొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరి బస్సుపైనే పడ్డాడు. దీంతో స్పాట్‌లోనే ప్రాణాలు విడిచిపెట్టేశారు. వెంటనే బస్సుతో వెళ్లి ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్ లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. శంషాబాద్ కొత్వాల్‌గూడ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డులో బైక్ అదుపుతప్పి ఒక ప్రయాణికులు మృతి చెందాడు. ప్రమాద సమయంలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అతి వేగంతో వెళ్తున్న బైక్ అదుపు తప్పి స్కిడ్ అయి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా... మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. రాజేంద్రనగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -