GTA 6 Release Date: జీటీఏ 6 (గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6) అభిమానుల నిరీక్షణ వచ్చే ఏడాది ముగియనుంది. ఈ గేమ్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని లాస్ట్ వెర్షన్ 2013లో వచ్చింది. అప్పటి నుంచి ప్రజలు దాని కొత్త వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కంపెనీ దాని విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు. కానీ ఆర్థిక నివేదిక 2025 రెండో సగంలో రావచ్చని సూచించింది. ఈసారి ఇది పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్|ఎస్‌లో అందుబాటులో ఉంటుంది. దీని పీసీ వెర్షన్ 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.


రెండో ట్రైలర్ త్వరలో...
గేమ్ మేకర్ రాక్‌స్టార్ ఇప్పటికే దాని మొదటి ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇది గేమ్‌ప్లే ఫుటేజ్, మ్యాప్ వివరాలను వెల్లడించింది. దీని రెండో ట్రైలర్ కూడా త్వరలో విడుదల కానుంది. ఇది గేమ్ గురించి మరింత సమాచారాన్ని వెల్లడిస్తుంది. 



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


జీటీఏ 6 మ్యాప్
గేమ్ కొత్త వెర్షన్‌లో గేమర్లు కల్పిత నగరమైన లియోనిడాలో గేమ్‌ను ఆడే ఆనందాన్ని అనుభవించే అవకాశాన్ని పొందుతారు. ఈ నగరం ప్రధానంగా ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్, కీస్ ప్రాంతం నుండి ఇన్‌స్పిరేషన్ పొందింది. ఈ మ్యాప్‌లో వైస్ సిటీ కూడా ఉంటుంది. జీటీఏ 6 రద్దీగా ఉండే బీచ్‌లు, నియాన్ లైట్ కలర్ సిటీ వీధులు, బ్యాక్‌వాటర్ ప్రాంతాలను కలిగి ఉంటుందని దీని మొదటి ట్రైలర్ చూపిస్తుంది.


గేమ్‌ప్లే లీక్‌లు కొత్త వెర్షన్‌లో అధునాతన స్టెల్త్ మెషీన్‌లు, మునుపటి కంటే మరింత కఠినమైన పోలీసులు ఉంటారని సూచిస్తున్నాయి. ఇది ఫైవ్ స్టార్ వాంటెడ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనిలో పోలీసులు గేమర్‌లతో కఠినంగా వ్యవహరిస్తారు. తమ ప్రొడక్ట్ షెడ్యూల్‌లో ఉందని, తగిన డేటా సెక్యూరిటీ ఏర్పాట్లు చేసే వరకు విడుదల చేయబోమని కంపెనీ తెలిపింది.


ధర ఎంత కావచ్చు?
కొత్త జీటీఏ గేమ్ ధర గురించి ఊహించడం చాలా తొందరగా ఉంది. అయితే దీని ధర జీటీఏ 5, రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఇది భారతదేశంలో దాదాపు రూ. 6,000కి లాంచ్ కావచ్చు.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!