Telangana SI and woman constable committed suicide due to extramarital affairs: కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు మరో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర బంధం కారణంగానే ఈ మూడు ప్రాణాలు కడతేరిపోయినట్లుగా పోలీసులకు ఆధారాలు లభించాయి.
భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ కు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆయితే ఆయనకు కానిస్టేబుల్ శృతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అది వివాహేతర బంధానికి దారి తీసింది. ఇటీవల ఈ బంధానికి ముగింపు పలకాలని శృతి నిర్ణయించుకున్నారు. ఎస్ఐ సాయి కుమార్ కి అప్పటికే పెళ్లి అయిపోవడంతో .. తనను శారీరకంగా ఉపయోగించుకంటారు కానీ పెళ్లి చేసుకుంటారన్న నమ్మకం లేకపోవడంతో ఆమె మోర యువకుడ్ని ప్రేమించింది. కంప్యూ టర్ ఆపరేటర్ గా పని చేసే యువకుడ్ని ప్రేమించింది. క్రమంగా ఎస్ఐని దూరం పెడుతూ ఆ యువకుడికి దగ్గర అయింది.
శృతి తనకు దూరం అవడడం ఇష్టం లేని ఎస్ఐ.. తనతోనే ఉండాలని ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తాను మరో యువకుడ్ని ప్రేమించానని అతనితోనే కలిసి జీవిస్తానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మాట్లాడేందుకు ముగ్గురూ చెరువు కట్ట దగ్గరకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో కానీ ముగ్గురూ నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారమే రెండు మృతదేహాలను బయటకు తీసినప్పటికీ మూడో మృతదేహం కనిపించలేదు. ఉదయాన్నే గజఈతగాళ్లతో వెదికారు. ఎస్ఐ మృతదేహం కూడా బయటపడింది.
భిక్కనూరు ఎస్సై సాయికుమార్ సెల్ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. అటు, బీబీపేట ఠాణాలో పనిచేస్తోన్న లేడీ కానిస్టేబుల్ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరు గాంధారి మండలం గుర్జాల్లో ఉంటున్నారు. శ్రుతి స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలపడంతో పేరెంట్స్ అధికారులను సంప్రదించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. చివరికి వారి మృతదేహాలను చెరువులోనే కనుగొన్నారు.