Shruti Haasan about relationships : శృతిహాసన్ ఇటీవల కాలంలో తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువగా వార్తలో నిలుస్తుంది. తాజాగా ఈ అమ్మడు తనకు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదో వెల్లడించింది. పైగా పెళ్లి కంటే రిలేషన్షిప్ లో ఉండడానికే ఎందుకు ఆసక్తిని చూపిస్తుందో కూడా తాజా ఇంటర్వ్యూలో శృతిహాసన్ వెల్లడించింది.
పెళ్లి కంటే రిలేషన్షిప్ బెటర్
లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్... కెరీర్ మొదట్లోనే ఐరన్ లెగ్ అనే ముద్రను వేసుకుంది. ఆ తర్వాత తన యాక్టింగ్ స్కిల్స్ తో పాటు లుక్స్ కూడా మార్చుకుని రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని, మొత్తానికి ఐరన్ లెగ్ అన్న వారితోనే లక్కీ గర్ల్ గా పిలిపించుకుంది. ఇక రీసెంట్ గా 'సలార్' సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా సక్సెస్ ని అందుకుంది. ప్రస్తుతం శృతిహాసన్ క్రేజ్ పీక్స్ లో ఉంది. అయితే అంతకంటే ఎక్కువగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పెళ్లెప్పుడు ? అంటూ సోషల్ మీడియాలో శృతిహాసన్ ను ప్రశ్నిస్తుంటారు అభిమానులు.
అయితే గతంలో ఇలాగే ఓసారి పెళ్లి ప్రశ్న ఎదురు కాగా, తాను పెళ్లి చేసుకొనని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా ఇంటర్వ్యూలో శృతిహాసన్ దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావించగా "నిజానికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లయితే చేసుకోను అని చెప్పాను కానీ, ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు. నాకు రిలేషన్ షిప్ లో ఉండడం ఇష్టం. అలాగే రొమాంటిక్ గా ఉండడం కూడా. నా చుట్టూ ఉండే వారితో చాలా చనువుగా ఉంటాను. అయితే ఇప్పటికైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఫ్యూచర్లో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వాళ్లను పెళ్లి చేసుకుంటాను. ఇది కంప్లీట్ గా నా పర్సనల్ డెసిషన్. నా స్నేహితులు, బంధువులు ఎంతోమంది పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు" అని చెప్పుకొచ్చింది.
ఇప్పటికీ సింగిలే...
పెళ్లి గురించి శృతిహాసన్ దగ్గర ప్రస్తావన రావడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. రీసెంట్ గా ఇన్స్టా లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ లో శృతిహాసన్ ను నెటిజన్లు రిలేషన్షిప్ గురించి ప్రశ్నించారు. "మీరు సింగిలా ? రిలేషన్షిప్ లో ఉన్నారా?" అనే ప్రశ్నకు ఆమె ఘాటుగా రెస్పాండ్ అయింది. "నాకు అసలు ఇలాంటి ప్రశ్నలు నచ్చవు. అయినప్పటికీ చెప్తున్నాను ఇప్పుడు నేను సింగిల్. రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికైతే పనిలో బిజీగా ఉన్నాను. లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. కొన్నాళ్ళ క్రితం డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతి హాసన్ కు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు శృతిహాసన్ పలు బిగ్ సినిమాలతో బిజీగా ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న 'కూలీ'లో శృతిహాసన్ కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆమె ఖాతాలో పాన్ ఇండియా మూవీ 'శౌర్యంగ పర్వం' కూడా ఉంది.