Breaking News: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ 

Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 03 Apr 2024 02:33 PM
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ 

Killi Kruparani: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా వైసిపికి గట్టి షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్ట పడి పనిచేసిన తగిన గుర్తింపు లేని కారణంగా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Janasena Chief Pawan Tenali Tour Cancelled: పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన రద్దు

Janasena Chief Pawan Tenali Tour Cancelled:  2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెనాలి పర్యటించాల్సిన పవన్ పర్యటన రద్దు అయింది.గత మూడు రోజులుగా పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఇవాళ జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. 

Krishna District: భారీగా చీరలు పట్టుకున్న పోలీసులు- ఎన్నికల టైంలో పంచేందుకు సిద్దమైనట్టు సమాచారం

కృష్ణాజిల్లా పామర్రు మండలం పెరిశేపల్లిలోని చెరుకూరి వెంకన్న చౌదరి ఇంట్లో చీరల డంప్‌ను పోలీసులు వెలికితీశారు. ఎన్నికల్లో పంచేందు సిద్ధంగా ఉంచిన చీరలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై డీఎస్పీ శ్రీకాంత్ ఏమన్నారంటే... "ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన పార్టీకి చెందిన చీరలు పట్టుకున్నాం. పోలీసులు వచ్చిన చాలా సమయం తర్వాత యజమాని వచ్చి ఇంటి తాళాల తీశాడు. దీనిపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో తనీఖీలు చేశాం. రాత్రి 11.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నాం. సుమారు రూ.10లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు గుర్తించాం. పామర్రు ఎస్ఐ, సిఐకి వచ్చిన సమాచారంతోనే తనిఖీలు." మొత్తం 46 బండిల్స్ చీరలను పోలీసులు సీజ్ చేశారు. విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చినట్లు  పోలీసు విచారణలో తేలింది. 

Jayaprada: తిరుమలేశుడి దర్శనానికి జయప్రద

Jayaprada In Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం కోసం సిని నటి జయప్రద మంగళవారం రాత్రి తిరుపతి కి చేరుకున్నారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి వారి ని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలకు వెళ్లారు. ఆమెతో అక్కడి భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది ఫొటోలు తీసుకోన్నారు.

Nomula Bhagath: మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇల్లు సీజ్

BRS Leader Nomula Bhagath House Seized in Hyderabad: హైదరాబాద్‌లోని నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. ఆయన ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఇంటిని సీజ్ చేసారు. విషాయన్ని తెలుసుకొని ఇంటి దగ్గరకు వస్తున్న ఆయన్ని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇది రాజకీయ కక్షసాధింపు అని నోముల భగత్ మండిపడ్డారు. కావాలనే తన ఇంటిని సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Background

Latest Telugu Breaking News: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేయనున్నారు. అనారోగ్యంపాలైన, నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటికి వద్దకే వెళ్లి పింఛన్లు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65లక్షల 69వేల 904 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.


ఇప్పటి వరకు వలంటీర్లతో పంపిణీ కార్యక్రమం జరిగేది. అయితే కొందరు వాలంటీర్లు అధికార పార్టీ వైసీపీ నాయకుల ప్రచారంలో పాల్గొనడంతో వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అంతే కాకుండా వలంటీర్లు తమ పార్టీ సానుభూతిపరులు, తన అభిమానులే అంటూ జగన్‌తోపాటు వైసీపీ నాయకులు చెబుతూ వచ్చారు. వీటన్నింటినపై సిటిజన్ ఫోరమ్ సంస్థ ఎన్నికల సంఘానికి ఫిర్యాుద చేసింది.  అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వలంటీర్లను పింఛన్ల పంపిణీలో భాగం చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. 


ఈసీ ఆదేశాల మేర సీఎస్‌, సెర్ప్‌ ముఖ్య కార్యదర్శి మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఏప్రిల్, మే, జూన్‌లో చేపట్టాల్సిన పింఛన్ల పంపిణీపై  కొత్త ఉత్తర్వులు ఇచ్చారు. ప్రత్యేకంగా పరిగణించే వ్యక్తులకే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని, మిగతా వారికి సచివాలయం వద్దే పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. పంపిణీ ప్రక్రియను వీలైన త్వరగా పూర్తి చేసేందుకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక జాగ్రత్‌లు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.