Pushpa 2 Trailer Launch Highlights: పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్

Pushpa 2 Trailer Telugu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరుగుతోంది. ఆ ఈవెంట్ లైవ్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.

Advertisement

Satya Pulagam Last Updated: 17 Nov 2024 07:55 PM
ఫస్ట్ టైమ్ పాట్నా వచ్చా... మీ ప్రేమ కోసం తగ్గుతా - అల్లు అర్జున్

బీహార్ ప్రజలు అందరికీ నా నమస్కారాలు అంటూ స్పీచ్ ప్రారంభించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... తొలిసారి బీహార్ వచ్చాయని, మీరు చూపిస్తున్న ప్రేమ - ఈ స్వాగతానికి ధన్యవాదాలు అని చెప్పారు. పుష్ప ఎప్పుడూ తగ్గడు, కానీ మీ ప్రేమకు ఈ రోజు తొలిసారి తగ్గుతాడని ఆయన చెప్పారు. పాట్నాకు ధన్యవాదాలు తెలిపారు.  తన హిందీలో తప్పులు ఉంటే క్షమించమని కోరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఇప్పుడు వైల్డ్ ఫైర్. మూడేళ్ళుగా దేశమంతా 'పుష్ప 2' కోసం ఎదురు చూస్తుందంటే అది ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ వల్ల సాధ్యమైంది. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు, అభిమానుల వల్లే ఇదంతా సాధ్యమైంది. మా టీమ్ అందరికీ థాంక్స్. డిసెంబర్ 5న సినిమా వస్తుంది. అందరికీ సినిమా నచ్చుతుంది'' అని చెప్పారు. అభిమానులు డైలాగ్ చెప్పమని రిక్వెస్ట్ చేయగా... 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫ్లవర్ కాదు' అని చెప్పారు. 

Background

Watch Allu Arjun's Pushpa 2 Trailer Launch Live: పుష్ప విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అప్పుడు ఈ సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని గానీ లేదంటే ఉత్తరాదిలో ఘన విజయం అందుకుంటుందని‌ గానీ ఎవరు ఊహించలేదు. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పురస్కారం అందుకుంటారని కలలోనూ అనుకుని ఉండరు. 


అద్భుతం జరగడం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కదా! విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడంలోనూ పురస్కారం తెచ్చుకోవడంలోనూ అల్లు అర్జున్ అద్భుతం చేశారు. పుష్ప ది రైజ్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకు ఉదాహరణ పుష్ప ట్రైలర్ విడుదల వేడుక పాసుల కోసం బీహారులో జనాలు బారులు తీరడం! ఈ రోజు ఈ వేడుక ఘనంగా జరగనుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఐ ఈవెంట్ లైవ్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. 


అల్లు అర్జున్, రష్మిక మందన్న జంట మరోసారి పుష్ప శ్రీవల్లి పాత్రల్లో 'పుష్ప ది రూల్'లో సందడి చేయనున్నారు.‌ మొదటి పార్ట్ (పుష్ప) లో పాటలు బ్లాక్ బస్టర్ య్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రెండో పార్ట్ కి మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. ఆల్రెడీ విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. మరి తర్వాత రాబోయే పాటలు ఎలా ఉంటాయో చూడాలి.


క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో రెండో పార్ట్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. ఆల్మోస్ట్ 500 కోట్లు అయినట్టు ఇండస్ట్రీ గుసగుస. ఫ్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల వరకు జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీకి 300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్.


Also Read: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?



Pushpa 2 The Rule Release Date: డిసెంబర్ 5న 'పుష్ప 2: ది రూల్' సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఇండియాలో విడుదల కంటే ఒక్క రోజు ముందు ఓవర్సీస్, అమెరికాలో షోలు వేస్తున్నారు. ఇండియాలోనూ సెలెక్ట్ చేసిన కొన్ని సిటీల్లో ప్రీమియర్ షోలు వేసే అవకాశం ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది.


Pushpa 2 The Rule Cast And Crew: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేశారు. ఆయన మరోసారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించనున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేశారు. డిఎస్పీతో పాటు తమన్ నేపథ్య సంగీతం అందించారు.


Also Read: గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్... బ్యాక్ స్టేజ్‌లో ఏం జరిగింది? ప్రోగ్రాం హైలైట్స్ ఏంటో తెలుసా?


© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.