Group 3 Exam In Telangana: తెలంగాణ వ్యాప్తంగా 1,365 పోస్టుల కోసం టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-౩ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో దాదాపు ఐదు లక్షల మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఇవాళ(ఆదివారం) రెండు పేపర్లు, సోమవారం ఒక పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తున్నారు. 


ఉదయం పది గంటలన నుంచి 12.30 ఒక పేపర్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంకొక పరీక్ష నిర్వహిస్తారు. సోమవారం మూడో పరీక్షలను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మరో పరీక్ష ఉంటుంది. అర గంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను క్లోజ్ చేశారు. 


అర గంట ముందే గేట్లు క్లోజ్ చేయడంతో చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. చాలా దూరం ప్రాంతాల నుంచి వచ్చే క్రమంలో ఆలస్యమైందని అధికారులను వేడుకున్నా లోపలికి అనుమతి ఇవ్వలేదు. నిమిష ఆలస్యం రూల్ అమల్లో ఉన్నందున పరీక్షకు అనుమతి ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. 


చాలా ప్రాంతాల్లో అడ్రెస్ తెలియక వేర్వేరు సెంటర్‌లకు వచ్చిన అభ్యర్థులను పోలీసులే స్వయంగా వారిని అసలైన సెంటర్‌లో డ్రాప్ చేశారు. మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్లలో గౌతమి కాలేజీకి వచ్చిన ఓ అభ్యర్థిని పోలీసులు హాల్‌టికెట్‌లో ఉన్న సెంటర్‌లో డ్రాప్ చేశారు. బాలానగర్‌లోనీ గీతాంజలి కళాశాల అని తెలుసుకుని ఇబ్బంది పడుతున్న ఆమెను జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ(శ్రీనివాస్) తమ వాహనంలో తీసుకెళ్లి పరీక్ష కేంద్రానికి చేర్చారు. 


దివ్యాంగ గ్రూప్ 3 అభ్యర్థికి ఎస్సై సహాయం 
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్ ఎస్సై ధీకొండ రమేష్ తన ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. గ్రూప్‌-3 పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ దివ్యాంగ అభ్యర్థి స్థానిక బస్ స్టాండ్ వద్ద వాహనం కోసం ఎదురు చూస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఎస్సై రమేష్ ఆ వ్యక్తిని గమనించి తన వాహనములో కూర్చోబెట్టుకుని సెంటర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఒక్కర్నే కాదు పలువురు అభ్యర్థులను కూడా పోలీస్ ప్రత్యేక వాహనాల్లో కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ఇబ్బంది పడకూడదన్న కారణంతో పోలీస్ శాఖ ఈ చర్యలు తీసుకుంది. 


Also Read: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర