Breaking News: కేజ్రీవాల్ కు జ్యుడీషియల్ కస్టడీ, 15 రోజులు తీహార్ జైలులోనే
Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
Kakinada News: కాకినాడ జిల్లా కత్తిపూడిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్యాస్ ట్యాంకర్‌ను వెల్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. గ్యాస్ లీక్ అవుతున్న ట్యాంకర్ వెల్డింగ్ చేస్తుండగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ ఇంటికి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెళ్లారు. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్టే కనిపిస్తోంది. ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన్ను టీడీపీ, జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేతో ప్రస్తుత అభ్యర్థి సమావేశం కావడంతో వివాదం సమసిపోయింది.
ఇరు పార్టీ నేతల మధ్య కుదిరిన సయోధ్య కురిదిన అనంతరం ఇరు వర్గాలు మీడియాతో మాట్లాడారు. సుగుణమ్మ మాట్లాడుతూ..."టిడిపి ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం తథ్యం. గత ఐదేళ్లుగా వైసీపీ అక్రమాలను ఎండకట్టాం. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తాం. చంద్రబాబు సిఎంగా అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు ఆయన శపథం నెరవేరెలా పని చేస్తాం. పొత్తులో భాగంగా జనసేనకు తిరుపతి సీటు కేటాయించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపిస్తాం. ఆఖరిగట్టంలో విజయం సాధించి చంద్రబాబుకు తిరుపతిని కానుకగా ఇస్తాం. శ్రీనివాసులు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం.
అనంతరం తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ..." టిడిపిలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు సమసిపోయాయి. వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, తిరుపతి అభివృద్ధి గాడి తప్పాయి. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు టిడిపి బిజేపిలతో కూటమిని పవన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావడం ఖాయం. గత ఐదేళ్లుగా తిరుపతిలో ఎం.సుగుణమ్మ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ప్రస్తుత అభ్యర్థి అభినయ్ రెడ్డి ప్రజలను వేధించారు. వైసీపీ నేతలు తిరుపతిని లూఠీ చేశారు. టిడిఆర్ బాండ్లలో నిజమైన బాధితులకు న్యాయం చేస్తాం. తిరుపతిలో గంజాయి అమ్మకాలను అరికడతాం. అందరి సహకారంతో తిరుపతిని అభివృద్ధి చేస్తాం. గాజు గ్లాసుకు ఓటు వేసి నన్ను గెలిపించండి, ప్రజా సేవకుడిగా పనిచేస్తా. టిడిపి...బీజీపీ... జనసేన కార్యకర్తలు...నాయకులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటా .
జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ... :" రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతం చంద్రబాబు నాయుడు, మోదr, పవన్ లక్ష్యం. రాష్ట్రంలో ప్రజలను గెలిపించేందుకు మూడు పార్టీల అగ్రనేతలు నిర్ణయించారు. రాష్ట్రంలో స్వేచ్చా, స్వాతంత్రం వైసిపి పాలనలో లేకుండా పోయాయి. జనసేన అభ్యర్థికి మద్దతుగా ఇప్పటికే బిజెపి నిలవగా టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ముందుకు రావడం సంతోషం. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డిని ఓడించి జనసేన జెండా ఎగరేస్తాం.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజీవాల్‌కు కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయన్ని ఏప్రిల్ 15వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో కేజీవాల్‌ను తిహార్ జైలుకు తరలించనున్నారు.
నంద్యాల జిల్లా నందికొట్టుకురులో తెలంగాణ పోలీసు రావడం టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని ఓ కేసు విషయంలో టీడీపీ నేతను అరెస్టు చేసేందుకు వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ ల్యాడ్ వివాదంలో తెలుగుదేశం పార్టీ నేత మాండ్రు శివారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు తెలంగాణ పోలీసులు అల్లూరి గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా అల్లూరి గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న మాండ్ర శివారెడ్డి అనుచర వర్గం భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్‌లో ఓ వివాదాస్పద స్థలం విషయంలో శివారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు తెలంగాణ పోలీసులు అల్లూరి గ్రామం చేరుకున్నారు. ఏపీలో ఎన్నికల వేళ శివారెడ్డి అరెస్టుపై అనుచరులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనను అరెస్టు చేయడానికి రావడంపై తెలంగాణ పోలీసులతో మాండ్ర శివారెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులతో మాట్లాడుతూనే బయటకు వచ్చి తన కారులో వెళ్లిపోయారు. ఆయన వెంట పోలీసులు కూడా వెళ్లారు. హైదరాబాద్ నగరంలోని స్థల వివాద విషయంలో మాండ్ర శివారెడ్డిపై 420 కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో హైదరాబాద్ టిసిఎస్ పోలీసులు ఉదయం అల్లూరి గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న శివారెడ్డి అనుచరులు అక్కడకు చేరుకొని పోలీసులను అడ్డుకున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని, సాగునీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని, మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ ఆధ్వర్యంలో ‘రైతు దీక్ష' చేయనున్నారు.
Background
Latest Telugu Breaking News: మద్యం స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. 14 రోజులపాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న కవిత ప్రస్తుతం జ్యుడీషియల్‌్ రిమాండ్‌లో ఉన్నారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజ విచారణ చేపట్టనున్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.
కిరాణ షాప్‌లో గంజాయి
మాదక ద్రవ్యాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోజుకో ప్రాంతంలో సరఫరాదారులను పట్టుకుంటున్నారు. తాజాగా ఓ కిరాణాషాప్‌లో గంజాయి విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేశారు. గచ్చిబౌలి పరిధిలోని నానక్‌రామ్‌గూడలో కిరాణషాపులో గంజాయి అముతున్న అనురాధభాయి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దూల్‌పేట్ నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు ఆమె వివరించారు.
కొన్ని రోజులుగా గంజాయి విక్రయాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఓవైపు సరఫరాదారులను, అమ్మకందారులను పట్టుకుంటున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో మరింత మందిపై దృష్టిపెట్టారు. వాళ్లను పక్కా ఆధారాలతో పట్టుకుంటున్నారు. నెల రోజుల నుంచి రోజుకు కొంతమందిని పక్కా సమాచారంతో అరెస్టు చేస్తున్నారు. ప్రస్తుతం చిక్కిన మహిళ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దూల్‌పేట్ నుంచి గంజాయిని తీసుకొచ్చి ప్యాకెట్లుగా మారుస్తున్నారు. వాటిని విద్యార్థులకు, కూలీలకు అమ్ముతున్నారు. 39 ఏళ్ల అనురాధ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఆమె వద్ద నుంచి 39 ప్యాకెట్లలో ఉన్న 300 గ్రాముల గంజాయితోపాటు 1200 నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రమాదం
హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసుపత్రిలో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. యునాని ఆసుపత్రిలోని ఎలక్ట్రిక్ పూల్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
రంగారెడ్డిలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్డ్ బోర్డు స్క్రాప్ గోదాంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. సుమారు 7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
విశాఖలో వన్యప్రాణుల రవాణా
విశాఖ జిల్లాలో వన్యప్రాణులను రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి రవాణా జరుగుతోందని ముందే తెలుసుకున్న పోలీసులు... గోపాలపట్నంలో తనిఖీలు చేపట్టారు. అనుకున్నట్టుగానే ఇద్దరు చిక్కారు. వారి వద్ద నుంచి రెండు నెమళ్లు, దుప్పి కొమ్ములు, స్టార్ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ చేస్తున్నారు. దీనిపై అటవీ అధికారులకు సమాచారమిచ్చారు పోలీసులు
- - - - - - - - - Advertisement - - - - - - - - -