Breaking News: అల్లూరిజిల్లా చింతపల్లి ఏజెన్సీలో విరిగిపడిన కొండచరియలు-నలుగుర్ని కాపాడిన గ్రామస్థులు

Breaking News: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో జోరువానలు పడుతున్నాయి.

Sheershika Last Updated: 09 Sep 2024 09:55 AM

Background

Breaking News: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సాయంత్రానికి పూరీ దగ్గర తీరం దాటబోతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు జోరు పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కుమ్మేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో స్థానికులను ఖాళీ చేస్తున్నారు. జీకే వీధి మండలంలో చింతపల్లి, చట్రాపల్లిలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. స్థానికులు కొందరిని కాపాడారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.