Breaking News: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది- దేవుడి దర్శనానికి కూడా అనుమతి లేదు: జగన్
Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో లడ్డూ వివాదం, జగన్ తిరుమల టూర్‌పై రగడ నడుస్తుండగానే తెలంగాణలో మంత్రి ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది. వీటిపై తాజా సమాచారాన్ని ఇక్కడ చూడండి.
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తామంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తున్న పరిస్థితులు ఎప్పుడూ దేశంలో జరిగి ఉండదు. వైసీపీ కార్పొరేటర్లకు, వైసీపీ నాయకులకు, వైసీపీ శ్రేణులకు నోటీసులు ఇవ్వడం
India Vs Bangladesh 2nd Test: కాన్పూర్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ముందుగానే ఆటను ఆపేశారు. మొదటి రోజు ఆట నిలిచిపోయే వరకు 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 107 పరుగులు చేసింది. ప్రస్తుతం ముష్ఫికర్ రహీమ్ ఆరు పరుగులతో, మొమినుల్ హక్ 40 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ తరఫున ఆకాశ్ దీప్ 2, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.
Jagan Tirumala Tour: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడనున్నారు.
Reliance Foundation Donated Rs. 20 crores to Telangana Chief Minister's Relief Fund : ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. ఇవాళ సీఎంతో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు రూ.20 కోట్లు విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ ను పిఎంఎస్ ప్రసాద్, పి వి ఎల్ మాధవరావు అందజేశారు.
FIDE Chess Olympiad gold winners meets Telangana CM: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని FIDE చెస్ ఒలంపియాడ్‌లో స్వర్ణ విజేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. స్వర్ణపతకాలు సాధించిన తెలంగాణ ఆటగాళ్లను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. భారతదేశం తరపున మొదటిసారి స్వర్ణ పతకాలను తెలంగాణ ఆటగాళ్లు అర్జున్ (హన్మకొండ) , ద్రోణవల్లి హారిక( ఖమ్మం) సాధించారు. ఇద్దరు ఆటగాళ్లకు చెరో రూ.25లక్షలు నగదు ప్రోత్సాహకం అందించారు సీఎం.
Background
తిరుమల లడ్డూతో మొదలైన వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలకు పిలుపునిచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం తిరుపతి వెళ్తున్నారు. ఆయన స్వయంగా తిరుమలేశుడి దర్శించుకొని వస్తారు. గతంలో చాలాసార్లు ఆయన తిరుపతి వెళ్లి వచ్చినా ఈసారి పర్యటన మాత్రం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలవడంలో జగన్ వల్లే జరిగిందని ప్రత్యర్థులు నమ్మడం, ప్రచారం చేయడంతో ఓవర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనికి తోడు పవన్ కల్యాణ్ పెట్టిన ప్రెస్‌మీట్ కూడా కాకరేపింది. ఇంత జరిగినా హిందువులకు బాధ్యత లేదా అంటూ ఆయన ప్రశ్నలు సంధించడంతో హిందూ స్వామీజీలు ఏకమై ఇప్పుడు జగన్ టూర్ అడ్డుకుంటామని సవాళ్లు చేస్తున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -