BJP Election Committee: జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం

BJP Election Incharges: మహారాష్ట్ర హరియాణాతో పాటు ఝార్ఖండ్‌ జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ కీలక ప్రకటన చేసింది.

Continues below advertisement

BJP Appoints Elections Incharges: లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు చోట్లా బీజేపీయే గెలిచింది. మరి కొద్ది నెలల్లో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హైకమాండ్‌ ఈ ఎలక్షన్స్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. మహారాష్ట్రకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా భూపీందర్ యాదవ్‌ని, కో ఇన్‌ఛార్జ్‌గా అశ్వినీ వైష్ణవ్‌ని నియమించింది. హరియాణాలో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ధర్మేంద్ర ప్రదాన్‌తో పాటు బిప్లవ్ కుమార్‌ ఎంపికయ్యారు. ఝార్ఖండ్‌లో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ పదవిని శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కి అప్పగించింది హైకమాండ్. ఆయనతో పాటు హిమంత బిశ్వ శర్మకీ ఈ బాధ్యతలు కట్టబెట్టింది. జమ్ముకశ్మీర్‌కి తెలంగాణ బీజేపీ నేత జి కిషన్‌రెడ్డిని నియమించింది అధిష్ఠానం. ఇటీవలే కిషన్‌ రెడ్డికి కేబినెట్‌లోనూ చోటు కల్పించింది. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక బాధ్యతనూ అప్పగించింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. 

Continues below advertisement

 


జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని సీఈసీ రాజీవ్‌ కుమార్ వెల్లడించారు. చివరి సారి అక్కడ 2014లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ముఫ్మీ మహమ్మద్ సయీద్ సీఎం బాధ్యతలు తీసుకున్నారు. 2016లో ఆయన చనిపోయాక కూతురు మెహబూబా ముఫ్తీ ఆ పదవిని చేపట్టారు. ఆ తరవాత బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చింది. ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. 

మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్‌లో మాత్రం ఈ సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ పట్టు కోల్పోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 13 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ మాత్రం 28 చోట్ల పోటీ చేసి కేవలం 9 స్థానాల్లో గెలుపొందింది. మహావికాస్ అఘాడియా 48 కి గానూ 30 సీట్‌లు గెలుచుకుంది. అయితే...మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీజేపీనే గెలిపిస్తారని, మహావికాస్ అఘాడియా కూటమి ఏ అభివృద్ధి చేయదని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక హరియాణా విషయానికొస్తే...ఇక్కడ బీజేపీ 10 సీట్లకు గానూ 5 స్థానాలు సొంతం చేసుకుంది. 2019లో మొత్తం క్లీన్‌ స్వీప్ చేసినా ఈ సారి మాత్రం వెనకబడింది. హరియాణాలో పట్టు నిలుపుకోవడంపై కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.

Also Read: Elon Musk: టెస్లా కార్‌లు కూడా హ్యాక్ అవుతాయేమో చూసుకోండి - మస్క్ వ్యాఖ్యలకు బీజేపీ నేత కౌంటర్

Continues below advertisement
Sponsored Links by Taboola