Puri Jagannath Rath Yatra: ఏటా ఆషాఢమాసంలో రెండో రోజు అయిన విదియ రోజు ప్రారంభమవుతుంది పూరీ జగన్నాథుడి రథయాత్ర. 2025లో జూన్ 27న వచ్చింది. ఈ రథయాత్ర గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో.. ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర (Puri Jagannath Rath Yatra) ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందే మొదలైంది. ఎప్పుడు అన్నది స్పష్టంగా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కాందపురాణంలోనూ రథయాత్ర గురించి స్పష్టంగా ఉంటుంది.
ప్రపంచంలో ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో విగ్రహాన్ని ఒక్కసారి ప్రతిష్ఠించిన తర్వాత కదపరు. ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకోసం వినియోగిస్తారు. కానీ పూరీ క్షేత్రంలో అలాకాదు..సాక్షాత్తూ గర్భగుడిలో ఉండే దేవుళ్లే బయటకు వస్తారు.
జగన్నాథుడి రథయాత్ర కోసం ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. వీటి తయారీ అక్షయతృతీయ రోజు ప్రారంభిస్తారు.
జగన్నాథుడి రథం పేరు గరుడధ్వజం
బలభద్రుని రథం పేరు తాళధ్వజం
సుభద్ర కోసం తయారు చేసిన రథం పేరు దేవదాలన
ఈ రథాన్ని తయారు చేసేందుకు కొన్ని లెక్కలుంటాయి.. ఎన్ని అడుగులు ఉండాలి? ఆ చక్రాల ఎత్తు ఎంత ఉండాలి? రథం తయారీకి ఎన్ని చెక్కముక్కలు వినియోగించాలో లెక్క ఉంటుంది.
ఎంతో మంది రాజులు ఉండి ఉండొచ్చు..కానీ లోకానికి రాజు జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు జగన్నాథ రథయాత్ర ప్రారంభానికి ముందు రథం ముందు బంగారు చీపురుతో ఊడుస్తారు.
సాధారణంగా ఏ రథయాత్ర జరిగినా ఊరంతా తిరిగి గుడికి చేరుకుంటుంది. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. గుండిచా అన్ని పిన్నిగారు దగ్గరకు వెళ్లి ఆగిపోతుంది. ఆ ఆలయం పూరీకి జగన్నాథుడి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గర్భగుడి నుంచి బయటకు వచ్చిన జగన్నాథుడు తొమ్మిది రోజుల పాటూ పిన్నిగారి ఇంటి దగ్గర ఉంటాడు. తిరిగి పదో రోజు పూరీ ఆలయానికి చేరుకుంటాడు. ఇలా తిరిగి వచ్చే యాత్రని బహుద యాత్ర అని పిలుస్తారు.
సీతారాముల కళ్యాణం జరుగే సమయంలో వర్షం కురుస్తుంది. ఎంత ఎండ మండిపోయినా నాలుగు చినుకులు అయినా కురుస్తాయి. అలాగే జగన్నాథుడి రథయాత్ర సమయంలో తప్పకుండా మేఘం వర్షిస్తుంది.
ఆలయం దగ్గర్నుంచి జగన్నాథస్వామి రథం ముందుకు కదలదు. తన ఆలయాన్ని వదిలి వెళ్లడం ఇష్టం ఉండదేమో..అందుకే ఎంత ప్రయత్నించినా రథం కదలదు. చాలా సమయం పట్టేస్తుంది..ఒక్కసారి కదిలిన తర్వాత అలా ముందుకి సాగిపోతుంది
జగన్నాథుడు తన ఆలయానికి తిరిగి వచ్చేసిన తర్వాత ‘సునా బేషా’ అనే ఉత్సవం జరుగుతుంది. అంటే భగవంతుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారన్నమాట. ఇందుకోసం 208 కిలోల బరువైన ఆభరణాలు వినియోగిస్తారు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి