2025 జూన్ 18 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 18th 2025
మేష రాశి (Aries) జూన్ 18, 2025
ఈ రోజు మీకు హెచ్చు తగ్గులతో కూడుకున్నదిగా ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. శత్రువులు చురుకుగా ఉంటారు. కుటుంబంలో పరస్పర విభేదాలు పెరిగే అవకాశం ఉంది. భార్యతో వాగ్వాదం జరగవచ్చు.
వృషభ రాశి (Taurus) జూన్ 18, 2025
ఈ రోజు మీరు మీ ఆరోగ్యం క్షీణించినట్టు అనిపిస్తుంది. ఏదైనా ప్రత్యేక విషయం గురించి మీరు మానసికంగా కలత చెందుతారు. వ్యాపారంలో ఈ రోజు కొత్త పనిని ప్రారంభించవద్దు. భారీ పెట్టుబడులు పెట్టొద్దు. కుటుంబంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి..వివాదాలు జరుగుతాయి
మిథున రాశి (Gemini) జూన్ 18, 2025
ఈ రోజు మీకు సంతోషంగా గడుస్తుంది. ఆగిపోయిన పాత పని ఈ రోజు పూర్తవుతుంది. ఆరోగ్య విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పనిని ప్రారంభించవచ్చు. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా మతపరమైన యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కర్కాటక రాశి (Cancer) జూన్ 18, 2025
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఏదైనా ఆధ్యాత్మిక యాత్రలు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఓ ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు, దీనివల్ల భవిష్యత్తులో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారంలో కొత్త పనిని ప్రారంభించవచ్చు. ఈ రోజు పెద్ద డీల్ లేదా భాగస్వామ్యాన్ని పొందవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది.
సింహ రాశి (Leo) జూన్ 18, 2025
ఈ రోజు మీరు పాత స్నేహితుడిని కలుస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. వ్యాపారంలో సహచరులతో వాగ్వాదం జరగవచ్చు. కుటుంబంలో పరస్పర విభేదాలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించండి.
కన్య రాశి (Virgo) జూన్ 18, 2025
ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆగిపోయిన పని పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు ఈ రోజు కొత్త పనిని ప్రారంభించవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు.
తుల రాశి (Libra) జూన్ 18, 2025
ఈ రోజు మీకు మంచి రోజు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో శుభవార్త వింటారు. మీరు ఈ రోజు ఏదైనా ప్రత్యేక పని ప్రారంభించవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio) జూన్ 18, 2025
ఈ రోజు మీరు మీ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. సంతోషంగా గడిపేస్తారు. ఈ రోజు మీకు పెద్ద వర్క్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో శుభవార్త వింటారు.
ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 18, 2025
ఈ రోజు మీరు పెద్ద పనిని ప్రారంభించవద్దు...నష్టపోతారు. అప్పులు చేయవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారంలో సహచరులు వదిలివేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది. కుటుంబంలో కొత్త అతిథి వస్తారు.
మకర రాశి (Capricorn) జూన్ 18, 2025
ఈ రోజు మీరు కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో సహచరుల సహకారం లభిస్తుంది. మీరు ఈ రోజు కార్యాలయంలో పెద్ద పనిని పొందవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. కుటుంబంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు.
కుంభ రాశి (Aquarius) జూన్ 18, 2025
ఈ రోజు మీకు శుభసూచకంగా ఉంటుంది. మీ సంతానంలో ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్టైతే ప్రయత్నం సఫలం అవుతుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం ఈ రోజు మీకు లభిస్తుంది. నూతన వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీన రాశి (Pisces) జూన్ 18, 2025
ఈ రోజు మీరు కుటుంబంలో పెద్దల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. భార్యతో విభేదాలు తొలగిపోతాయి. ఏదైనా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఈ రోజు కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.