BBC Documentary:


పిటిషన్‌తో సమయం వృథా: కిరణ్ రిజిజు 


2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై తీసిన BBC డాక్యుమెంటరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీపైనా అందులో ప్రస్తావన ఉండటం మరింత అగ్గి రాజేసింది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించింది. అయితే...దీన్ని సవాలు చేస్తూ ఓ అడ్వకేట్ సుప్రీంకోర్టు ఆశ్రయించగా...సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ మొత్తం పరిణామాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఇలాంటి పిటిషన్లతో సుప్రీం కోర్టు విలువైన సమయం వృథా అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. "సామాన్యులు తమకు న్యాయం జరగాలని సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటే...ఇలాంటి పిటిషన్లతో కోర్టు విలువైన సమయాన్ని వృథా అవుతోంది" అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా...కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. విచారించేందుకు సుప్రీం కోర్టే అంగీకారం
తెలిపాక... ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని కొందరు పెదవి విరుస్తున్నారు. 






ఆ డాక్యుమెంటరీపై దుమారం 


అడ్వకేట్ ఎమ్‌ఎల్ శర్మ ఈ పిటిషన్ వేశారు. ఈ ఏడాది జనవరి 21న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ BBC డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్డర్‌ను సవాలు చేస్తూ ఎమ్‌ఎల్ శర్మ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. BBC డాక్యుమెంటరీలోని రెండు భాగాలనూ  పరిశీలించాలని కోర్టుని కోరారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిగారు. గుజరాత్ అల్లర్లపై నిజానిజాలు తెలుసుకునే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్ 19 (1) (2) ప్రకారం ఆ హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ఉత్తర్వులతో కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛనూ అణిచివేయాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు ఎమ్‌ఎల్ శర్మ. ఆ డాక్యుమెంటరీలో ఎన్నో నిజాలు ఉండొచ్చని, అవే సాక్ష్యాధారాలుగానూ మారే అవకాశముందని అన్నారు. ఈ విషయాలు వెలుగులోకి వస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. జనవరి 21న కేంద్రం " India: The Modi Question"పేరిట ఉన్న యూట్యూబ్ వీడియోలు, ట్విటర్ వీడియోలను బ్లాక్ చేయాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ట్విటర్‌తో పాటు మరి ఏ సామాజిక మాధ్యమాల్లోనూ 
ఆ వీడియోలు లేకుండా నిషేధం విధించింది. 2002లో గోద్రా రైల్వే స్టేషన్​ సమీపంలో సబర్మతి ఎక్స్​ప్రెస్​లోని రెండు బోగీలు దగ్ధమై.. 59 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం.. గుజరాత్​లో మత ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు 
చేసిన సిట్ మోదీ క్లీన్ చిట్ ఇచ్చింది. 


Also Read: Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ