హైదరబాద్ హైటెక్స్ మూడు రోజులపాటు నిర్వహించిన  పెటెక్స్ 2023 జంతుప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ తోపాటు దూరప్రాంతాల నుండి జంతు ప్రేమికులు పెటెక్స్ లో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను ,పక్షులను ఈ పెటెక్స్ కు తీసుకురావడంతోపాటు ఇక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక పోటీలలో పాల్గొన్నారు.




 


ఈ ఏడాది జనవరి 27,28,29 తేదీలలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ జరిగిన ఈ పెంపుడు జంతువుల భారీ ప్రదర్శనలో మూడు రోజుల్లో ముఫై వేల మందికి పైగా సందర్శకులు పెటెక్స్ లో పాల్గొనగా చివరి రోజైన నిన్న సందర్శకుల సంఖ్య రెట్టింపైయ్యింది. ఈ పెటెక్స్ లో వివిధ రకాల బ్రీడ్స్ కు చెందిన డాగ్స్ తో పాటు ఇంటర్నేషన్ క్యాట్ షో లో పాల్గొన్న పిల్లులను సైతం ప్రదర్శనకు ఉంచడం వాటికి ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయడం వీక్షకులను మరింతగా ఆకట్టుకుంది. 




 


రకరకాల రంగుల అందమైన పక్షలను సైతం ఈ పెటెక్స్ లో కనువిందు చేశాయి.ఆక్వారేయం ఏర్పాటు చేసి 
అందమైన చేపలను సైతం కనువిందు చేసేలా ఈ పెటెక్స్ లో ప్రదర్శనకు ఉంచడంతో చిన్నారులను సైతం ఆకట్టుకుంది. పగ్,జర్మన్ షెపర్డ్,డాల్ మైసన్,పాపిలొన్,బుల్ టెర్రర్,ఆఫ్గాన్ హాండ్,రష్యన్ టోయ్,ఆఫ్రికానిస్ ఇలా 50కి పైగా వివిధ జాతులకు చెందిన పెంపుడు కుక్కలు ఈ పెటెక్స్ లో పాల్గొన్నాయి.




 


పెంపుడు కుక్కలతోపాటు వివిధ జాతులకు చెందిన పెంపుడు పిల్లులు సైతం ఈ పెటెక్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కంటికి ఇంపైన రంగులతో జంతుప్రేమికుల మనస్సు దోచుకున్నాయి.పిల్లుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసి చిన్న చిన్న బోన్ లతో వాటిని ఉంచడంతో పెటెక్స్ కు వచ్చేవారు పిల్లులను చూడమేకాదు ఆ బోను నుండి బయటకు తీసి చేతులతో నిమురుతూ ఆడుతూ ఎంజాయ్ చేసారు.దేశీయ జాతులతోపాటు ముఖ్యంగా విదేశీ జాతులైన పిల్లులు ఈ ఏడాది పెటెక్స్ లో హైలెట్ గా నిలిచియాయి.




 


రంగు రంగుల పక్షులతో పెటెక్స్ 2023 కొత్త అందం సంతరించుకుంది. ప్రిగేట్ పక్షి, మకావ్,బాతులు,మాట్లడే చిలుకలు,చిన్న గువ్వల నుండి అతి పెద్ద పక్షుల వరకూ పెటెక్ట్స్ లో వణ్యప్రాణుల ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.వివిధ రకాల చేపలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అక్వేరియంలు మాంచి వినోదాన్ని,విజ్జానాన్ని పంచాయి. సముద్ర గర్భంలో తేలియాడే చిన్న చిన్న జలచరాల నుండి భారీ చేపల వరకూ పెటెక్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.




 


అంతర్జాతీయ న్యాయ నిర్ణేతలు సైతం ఈ పెటెక్స్ లో పాల్గొని వివిధ పోటీలు నిర్వహించడం ద్వారా జంతుల 
పట్ల వాటిని పెంచే యజమానులకు ఉండాల్సిన కేరింగ్, గ్రూమింగ్ ఇలా అనేక అంశాలపై అవగాహాన కల్పించారు.
పోటీలలో గెలుపొందిన పెంపుడు కుక్కలకు ప్రత్యేక బహుమతులు ఇచ్చి సత్కరించారు.అంతర్జాతీయ స్దాయిలో నిర్వహించే ఐదవ పెటెక్స్ పదర్శన అద్భుతంగా జరిగింది. యాభై రకాలకు పైగా డాగ్స్,  అంతకు మించి ఇంటర్నేషన్ క్యాట్స్, విభిన్నమైన జాతుల పక్షలు,అందమైన చేపలు ఇక్కడ ప్రదర్శనకు వచ్చిన చిన్నపిల్లల నుండి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకున్నాయి. మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి పెంపుడు జంతువులకు అవసరమైన పౌస్టికాహారంతోపాటు వైవిద్యమైన దుస్దులు,అలంకరణ వస్తువులు వీక్షులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.