ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు అంతర్భాగం. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా బ్యాంకులు ద్వారానే సాగుతుంటాయి. నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.


Also Read: Cases On AP Govt : ఏపీ ప్రభుత్వంపై కేసుల సునామీ .. కోర్టుల్లో పెండింగ్‌లో లక్షా 94వేల పిటిషన్లు ..!


మూడు కేటగిరీల్లో


దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన బ్యాంకుల సెలవులను రిజర్వు బ్యాంకు ప్రకటించింది. సెలవుల లిస్ట్‌ను విడుదల చేసింది. మూడు కేటగిరీల్లో బ్యాంకుల సెలవుల్లో ప్రకటించింది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్ ఈ కేటగిరీలు ప్రకటించింది. మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంది. 


Also Read: AP Home Minster : ఏపీ హోంమంత్రిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ..! అనర్హతా వేటు పడుతుందా..?


రిజర్వు బ్యాంక్ ప్రకటన


వచ్చే నెలలో బ్యాంకులు ఏయే తేదీల్లో పని చేస్తాయో తెలిస్తే ఆ మేరకు ప్రణాళికలు వేసుకోటానికి వీలుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం సెప్టెంబర్‌ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులు ప్రకటించింది. 


Also Read: KCR SC Reservation : దళిత రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చిన సీఎం కేసీఆర్ !



  • సెప్టెంబర్​ 5- ఆదివారం

  • సెప్టెంబర్​ 8- బుధవారం (శ్రీమంత శంకరదేవ తిథి-అస్సాం మాత్రమే)

  • సెప్టెంబర్​ 9- గురవారం( తీజ్​- సిక్కింలో మాత్రమే)

  • సెప్టెంబర్​ 10- వినాయక చవితి

  • సెప్టెంబర్​ 11- రెండో శనివారం వినాయక చవితి

  • సెప్టెంబర్​ 12- ఆదివారం

  • సెప్టెంబర్ 17- శుక్రవారం కర్మపూజ(ఝార్ఖండ్​లో మాత్రమే)

  • సెప్టెంబర్​ 19- ఆదివారం

  • సెప్టెంబర్ 20- సోమవారం, ఇంద్రజాత్ర(సిక్కింలో మాత్రమే)

  • సెప్టెంబర్ 21- మంగళవారం, శ్రీ నారాయణ గురు సమాధి డే(కేరళలో మాత్రమే)

  • సెప్టెంబర్​ 25- నాలుగో శనివారం

  • సెప్టెంబర్ 26- ఆదివారం


Also Read: PK For YSRTP : జగన్ బాటలోనే షర్మిల రాజకీయ ప్రయాణం..!? ఇంతకీ ఆయన ఒప్పుకుంటాడా?


తెలుగు రాష్ట్రాల్లో 


తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి.  5, 12, 19, 26 ఆదివారాలు కాగా, 11వ తేదీ రెండో శనివారం, 25వ తేదీ నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవులు. సెప్టెంబర్‌ 10వ తేదీ వినాయక చవితి వచ్చింది. దీంతో  10, 11, 12 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోతున్నాయి.


 


Also Read: CM Jagan Cbi Case: అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్... సీబీఐవి తప్పుడు అభియోగాలు... తన పేరు తొలగించాలని సీఎం జగన్ పిటిషన్