CM Jagan Cbi Case: అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్... సీబీఐవి తప్పుడు అభియోగాలు... తన పేరు తొలగించాలని సీఎం జగన్ పిటిషన్

అక్రమాస్తులో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీహెచ్‌బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్ షీట్ నుంచి తన పేరు తొలగించాలని సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.

Continues below advertisement

 

Continues below advertisement

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్కకు మించిన ఆస్తుల కేసుల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టుల్లో విచారణ జరగుతుంది. ఇవి తనపై అక్రమంగా పెట్టిన కేసులని, వీటి నుంచి తన పేరు తొలగించాలని సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుల వ్యవహారం శుక్రవారం మరో మలుపు తిరిగింది. 

Also Read: Breaking: కాబుల్ పేలుళ్లపై అమెరికా ప్రతీకారం.. ఆ శిబిరాలపై యూఎస్ డ్రోన్ దాడులు

ఎంపీ విజయసాయి రెడ్డి కూడా

అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్‌బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్ షీట్ నుంచి తన పేరు తొలగించాలని సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు. ఈ మేరకు శుక్రవారం డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీబీఐ తప్పుడు అభియోగాలు మోపిందని జగన్ పిటిషన్ లో తెలిపారు. ఈ ఛార్జ్ షీట్‌లో మరో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తన పేరు తొలగించాలని కోర్టును కోరారు. వీటిపై నిన్న సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. పెన్నా కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా ఛార్జ్‌షీట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు శామ్యూల్, వి.డి.రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా విచారణను సీబీఐ కోర్టు సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.

Also Read: Theenmaar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్టు.. ఓ జ్యోతిష్యుడి ఫిర్యాదు వల్లే.. అసలేం జరిగిందంటే..

గతంలో 

సీఎం జగన్ పెన్నా కేసుకు సంబంధించి గత నెలలో డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.  పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని జగన్ కోర్టును కోరారు. ఇదే కేసులో కూడ తన పేరును కూడ తొలగించాలని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అప్పట్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. అలాగే అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్ నుంచి కూడా తనను తొలగించాలని సీఎం జగన్‌ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు వేశారు. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని కోర్టుకు తెలిపారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి పిటిషన్లు వేయని వారికి చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేస్తూ కోర్టు విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. 

 

Also Read: Petrol-Diesel Price, 28 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం స్థిరంగా..

Continues below advertisement