కామసూత్ర పుస్తకాలను కాల్చివేసిన బజ్‌రంగ్ దళ్ నేతలు.. హిందూ దేవతలను అవమానించడమే కారణం

హిందూ దేవతలను అవమానించే తీరులో చిత్రాలు ఉన్నాయనే కారణంతో కామసూత్ర పుస్తకాలను బజ్‌రంగ్ దళ్ నేతలు కాల్చివేశారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.

Continues below advertisement

హిందూ దేవతలను అవమానించే రీతిలో చిత్రాలు ఉన్నాయనే కారణంతో కామసూత్ర పుస్తకాలను తగలబెట్టిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌కి చెందిన బజ్‌రంగ్ దళ్ నేతలు ఒక బుక్ స్టోర్ ఎదుట ఈ పుస్తకాలను కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కామసూత్ర పుస్తకంలో ఉన్న ఫొటోలు అసభ్యకర రీతిలో ఉన్నాయని.. అవి హిందూ దేవతల రూపాలతో పోలి ఉన్నాయని బజ్‌రంగ్ దళ్ నేతలు ఆరోపించారు. ఈ కారణంగానే వీటిని తగలబెట్టినట్లు చెప్పారు. ఈ పుస్తకాలను మరోసారి అమ్మితే దుకాణాన్ని కూడా తగలబెట్టేందుకు వెనకాడబోమని షాపు యజమానిని హెచ్చరించారు. 

Continues below advertisement

కామసూత్ర పుస్తకంలో అసభ్యకర రీతిలో ఉన్న ఫోజులను (ఫొటోలు) బజ్‌రంగ్ దళ్ నేతలు తమ వీడియోలో చూపించారు. ఇవి హిందూ దేవతలను పోలి ఉన్నాయని ఆరోపించారు. అనంతరం ఈ పుస్తకాలన్నింటినీ దుకాణం బయట కుప్పగా పోసి తగలబెట్టారు. హర్ హర్ మహదేవ్, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ పుస్తకాలను తగలబెట్టినట్లుగా వీడియోలో ఉంది. 

Also Read: Breaking News: పొలం తగాదా విషయంలో ఘర్షణ.. కాల్పులు చేసిన మాజీ సైనికుడు.. ఇద్దరు మృతి

Also Read: మేనత్తను లవ్ చేసిన అల్లుడు.. గర్భం దాల్చిందని ఇంట్లో తెలిసింది.. చివరకు వారి ప్రేమ కథ ఏమైంది?

Also Read: Neelakurinji Flowers: కొడగు కొండల్లో నీలకురింజి అందాలు ... పన్నెండేళ్ల తర్వాత వికసించిన వనాలు... క్యూ కట్టిన ప్రకృతి ప్రేమికులు 

Continues below advertisement
Sponsored Links by Taboola