హరియాణా కర్నల్ లో రైతులపై జరిగిన లాఠీఛార్జిని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ ఖండించారు. రైతుల తలలు పగులగొట్టడంటూ పోలీసులకు కర్నాల్ జిల్లా ఉన్నతాధికారి ఆయుష్ సిన్హా ఆదేశాలివ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ ఐఏఎస్ అధికారిని 'తాలిబన్ల సర్కార్'కు కమాండర్ గా పేర్కొన్నారు.
నిన్న ఓ అధికారి రైతుల తలలు పగలగొట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. మమ్మల్ని వారు ఖలిస్థానీలు అంటున్నారు. మీరు మమ్మల్ని ఖలిస్థానీలు, పాకిస్థానీలు అని పిలిస్తే మిమ్మల్ని మేం 'సర్కారీ తాలిబన్లు' అని పిలుస్తాం.
రాకేశ్ టికాయత్, బీకేయూ నేత
ఇలాంటి ఆఫీసర్ లను నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని టికాయత్ అన్నారు.
Also Read:Ram Nath Kovind Ayodhya: రామాయణాన్ని మరింత ప్రచారం చేయాలి: రాష్ట్రపతి
ఖట్టర్ సపోర్ట్..
రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని హరియాణా సీఎం ఖట్టర్ సమర్థించారు. శాంతియుత నిరసనకే తాము అనుమతి ఇచ్చామని, కానీ రైతులు రాళ్లు రువ్వారని, జాతీయ రహదారిని దిగ్బంధించారని ఆయన అన్నారు. ఇందుకోసమే పోలీసులు లాఠీఛార్జి చేసినట్లు తెలిపారు.
Also Read: Haryana Farmers Protest: రైతులపై లాఠీ ఛార్జి చేయడంలో తప్పు లేదు: హరియాణా సీఎం