జాతీయ గీతం "జన గణ మన" పాడిన మిజోరాం.. చెందిన చిన్నారి ఎస్తేర్ హ్నామ్‌తే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. మిజోరాం చెందిన ఈ ఐదేళ్ల బాలిక ఆర్మీ యూనిఫాంలో జాతీయ గీతాన్ని అలపించింది. ఇప్పుడు ఆ చిన్నారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్తేర్ హ్నామ్‌తేను మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగతోపాటు కోట్లాదిమంది అభినందిస్తున్నారు. 


 






మిజోరంలోని లంగ్లీలో 3 అస్సాం రైఫిల్స్‌తో చిన్నారి జాతీయ గీతాన్ని పాడింది. ఆమె స్వస్థలం కూడా అక్కడే. ఎస్తేర్ ఆర్మీ యూనిఫామ్ ధరించి, సైనికులతో కలిసి పాడుతూ జెండాకి వందనం చేస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. అయితే ఈ వీడియోను జోరమ్‌తంగ.. సహా చాలా మంది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.


 


75 వ స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు ఆగస్టు 13న వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను ఆర్మీ అధికారులు పాపతో కలిసి చేయించారు. ఎస్తేర్ యూట్యూబ్ ఛానల్ కు ఐదు లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాదు.. ఆమె పాడిన పాటకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. ఇవే కాకుండా గతంలో పాడిన పాటలు కూడా వైరల్ అయ్యాయి.


ఎస్తేర్ వీడియోలో మీజోరంలోని ప్రకృతి అందాలను కూడా షూట్ చేశారు. స్థానిక సంగీతకారులు.. సంగీత వాయిద్యాలను వాడటం కూడా ఇందులో చూడొచ్చు. ఆర్మీ యూనిఫామ్ లో చిన్నారి సైనికులతో కలిసి కవాతు కూడా చేసింది. 


గతేడాది ఎస్తేర్  'వందేమాతరం' పాడినప్పుటి వీడియో కూడా వైరల్ అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆ చిన్నారిని ట్విట్టర్‌లో ప్రశంసించారు.


 






Also Read: Ram Nath Kovind Ayodhya: రామాయణాన్ని మరింత ప్రచారం చేయాలి: రాష్ట్రపతి