టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' లో ప్రశంసించారు. తన 80వ ఎడిషన్ మన్ కీ బాత్ లో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
చరిత్ర సృష్టించారు..
జాతీయ క్రీడాదినోత్సవం సందర్బంగా ప్రధాని.. టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురింపిచారు.
40 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో మనం పతకం సాధించాం. మేజర్ ధ్యాన్ చంద్ ఉండి ఉంటే ఎంత ఆనందపడేవారో ఊహించండి. స్పోర్ట్స్ పట్ల యువత మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదే ధ్యాన్ చంద్ కు మనం ఇచ్చే గొప్ప నివాళి. ఈ ఉత్సాహాన్ని మనం ఇలానే కొనసాగించాలి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని క్రీడా ప్రాంగణాలు ఆటగాళ్లతో నిండిపోవాలి. మరింతమంది యువత క్రీడల్లో పాల్గొంటే భారత్.. ఈ రంగంలో అనుకున్నంత ఎత్తుకు ఎదుగుతుంది. - నరేంద్ర మోదీ, ప్రధాని