పూలనే కునుకేయమంట...తను వచ్చేనంట అనే ఈ పాట చూసే ఉంటారు కదా. ఈ సాంగ్ లో వచ్చే లోకేషన్లు చూశారా నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి సుందరమైన పుష్పవనం భారత్ లో దర్శనమిస్తోంది. పన్నెండేళ్లకు ఒకసారి వికసించే ఈ పుష్పాలను చూసేందుకు ఓ హెలీ ట్యాక్సీ సంస్థ ఏరియల్ రైడ్ కూడా ఏర్పాటుచేసిందంటే ఆ ప్రాంతం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోంది. ఇంకెందుకు లేట్ మరీ అది ఎక్కడో చూసేయండి. 


కొడగు కొండల్లో 


కర్ణాటక రాష్ట్రంలోని కొడగు టూరిస్ట్ ప్రాంతం. సుందరమైన కొండలతో చాలా సుందరంగా ఉంటుంది. కొడగు కొండల్లోని మండల్ పట్టి, కోటే బెట్టా ప్రాంతాల్లోని పుష్ప వనాలు టూరిస్ట్ లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కొండల్లో నీలకురింజి పువ్వులు చాలా ఫేమస్. ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున్న ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాలకు వస్తున్నాయి. ఏరియల్ వ్యూ చూసేందుకు స్థానిక హెలి ట్యాక్సి సంస్థ ఏర్పాట్లు చేసింది. 


కోవిడ్ లాక్ డౌన్లతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు కోవిడ్ సడలింపుల తర్వాత పర్యాటక ప్రదేశాలకు వస్తున్నారని కొడగు అటవీ అధికారులు తెలిపారు.  గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో టూరిస్టులు అధికంగా కనిపిస్తున్నారని చెప్పారు. 


కోవిడ్ తర్వాత ఇంతగా


"పశ్చిమ కనుమల్లో భాగమైన మండల్ పట్టి కొండలు టూరిస్టలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రదేశాల్లో మాత్రమే కనిపించే నీలకురింజి లేదా స్ట్రోబిలంతెస్ కుంతియానా పుష్పాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. నాకు తెలిసి ఈ ఏడాదిలో తొలిసారి ఇంత మంది పర్యాటకులను ఇక్కడ చూడడం. ఈ కొండల్లో విస్తరించి ఉన్న నీలకురింజి వనాలు చాలా అరుదుగా వికసిస్తుంటాయి. ఈ ఏడాదిలో ఇది తొలిసారి." ఏటీ పూవయ్య, మడికేరి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (DCF)


బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న హెలీ ట్యాక్సి సంస్థ తుంబె ఏవియేషన్ సంస్థ ఈ ప్రాంతంలో ఏరియర్ వ్యూ చూసేందుకు ఒక్కొకరికి రూ.2.3 లక్షలతో రైడ్ ఆఫర్ చేస్తుంది. స్థానికంగా ఈ పువ్వులను కురింజి అంటారు. ఇవి సముద్ర మట్టానికి 1,300 నుంచి 2,400 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి. కురింజి పొదలు సాధారణంగా 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి.  ఇవి గుంపుగా పుష్పించడం వల్ల ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. 


 






కాఫీ తోటల వల్ల 


ఈ పువ్వులు ఇటీవల కాలంలో చాలా అరుదుగా కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా కొడగు కొండల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు. గతంలో చాలా ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు కాఫీ తోటల వల్ల చాలా అరుదుగా ఇవి కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఈ పొదలను కాఫీ తోటల పెంపకం కోసం ధ్వంసం చేస్తున్నారని అంటున్నారు. 




(ఫొటో: కర్ణాటక అటవీ శాఖ సౌజన్యం)


"రాష్ట్రంలో దాదాపు 45 జాతుల నీలకురింజి పొదలు ఉన్నాయి. వీటిల్లోని వివిధ జాతులు గుర్తించారు. ఇవి ఆరు, తొమ్మిది, 11 లేదా 12 సంవత్సరాల వ్యవధిలో వికసిస్తుంది. కొడగులో ఇవి గత వారం నుంచి వికసించడం కనిపిస్తుంది. కొండ మరికొన్ని రోజుల్లో పూలతో కప్పబడి ఉంటుంది"  కర్ణాటక అటవీ శాఖ 


గత సంవత్సరం చిక్కమగళూరు జిల్లాలో  బాబా భూదానగిరి కొండల్లో నీలకురింజి వికసించింది. 


 


Also Read: Kondapolam Song: ‘కొండపొలం’ వీడియో సాంగ్: ఓ ఓబులమ్మ అంటూ.. రకుల్‌తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్