‘ఉప్పెన’ సినిమాతో హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్ తేజ్.. ‘కొండపొలం’ చిత్రంతో మెగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైపోతున్నాడు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్.. కటారు రవీంద్ర యాదవ్‌గా విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ‘కొండపాలెం’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌ను ‘కొండ పొలం’గా ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రయూనిట్.. శుక్రవారం (ఆగస్ట్ 27న) ఈ సినిమాలోని వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓబులమ్మ పాత్రలో రకుల్ పల్లెటూరు అమ్మాయిగా కనిపించనుంది. ఇటీవల ఓబులమ్మ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత అందిస్తున్నారు. తాజాగా మ్యాంగో మ్యూజిక్ వీడియో సంస్థ విడుదల చేసిన ఓబులమ్మ సాంగ్.. సినిమాపై అంచనాలను పెంచేసింది.
‘‘ఓ.. ఓ.. ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ. కపర కపర వేకువ లోన.. కాలమంతా లెక్కలు గట్టి.. గుండెలోన నీ పేరు జపమాయె. ఇదివరకెపుడు తెలియని ఎరగని.. తురుపే మైమరిపిస్తూ ఉంటె.. కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే’’ అంటూ వచ్చే ఈ పాటను పీవీఎన్ఎస్ రోహిత్, సత్య యామిని ఎంతో చక్కగా ఆలపించారు. వినేకొద్ది వినాలనిపించేలా ఈ పాట ఉంది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి.
వీడియో:
ఇందులో వైష్ణవ్ తేజ్ గడ్డంతో కనిపించాడు. తలకు ఎర్రగుడ్డ కట్టుకున్న తేజ్.. ప్రతి నాయకులపై దాడికి దిగుతున్నట్లుగా ఫస్ట్‌లుక్ సీన్‌లో కనిపించింది. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్ర పోషిస్తోంది. కోటా శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమా, ఆంటోనీ, రవి ప్రకాష్, మహేష్ విట్టా, రచ్చ రవి, ఆనంద్ విహారి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాలో బాలనటుడిగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’, ‘అందరివాడు’ సినిమాల్లో నటించాడు. 2020లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా ‘కొండపొలం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాదిలోనే మరో రెండు సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు. మూడో చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, బాలీవుడ్ బ్యూటీ శోభితా రానాలను హీరోయిన్లుగా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరో చిత్రం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.