ముంబయి డ్రగ్స్ కేసులో మొదటి నుంచి సంచలన ఆరోపణలు చేస్తేన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయిన కాసేపటికే 'పిక్చర్ అబీ బాకీ హై మేరే దోస్త్' అని ట్వీట్ చేశారు. అయితే ఇది ఆర్యన్ ఖాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా లేక ఎన్‌సీబీ సీనియర్ అధికారి సమీర్ వాంఖడేను ఉద్దేశించినవా తెలియాలి.
ఆర్యన్‌కు బెయిల్..
అయితే డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధామేచాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు ముంబయి డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు ఎన్‌సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖడే. తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు.
అరెస్ట్‌కు ముందే నోటీసులు ఇస్తామని మహారాష్ట్ర సర్కార్ చెప్పడంతో ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
Also Read: PK : రాహుల్‌కు వ్యతిరేకంగా.. బీజేపీకి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ !
Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Also Read: Cruise Chip Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసు అప్‌డేట్.. కీలక సాక్షి గోసవీ అరెస్ట్
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి