Top 5 Headlines Today: ఇప్పుడుంది అసలు ఆట - కాంగ్రెస్‌ పాలకులనపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్
బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(Ktr)...తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Government) టార్గెట్ చేశారు.  లెక్కలు వేసుకుని హామీలు ఇస్తారా ? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా?  అని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయన్న ఆయన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలన్నారు. కాంగ్రెస్‌ పాలకులకు అసలు ఆట ఇప్పుడుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. శాసనసభ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆయన, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మాజీ మంత్రి మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు - గిరిజనుల భూమి కబ్జా చేసినట్లు ఆరోపణలు !
మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి.  మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని  సర్వేనెంబర్ 33 34 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టి (లంబాడీల)   వారసత్వ భూమిని మాజీ మంత్రి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి  వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేశారు. కుట్రతో మోసగించి భూమిని కాజేసారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ రాజకీయాల్లోకి షర్మిల - కాంగ్రెస్ ప్రణాళిక ప్రకారం గ్రౌండ్ రెడీ చేస్తోందా ?
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడ ప్రభుత్వం మారింది. అక్కడ పాలనా, అక్కడి రాజకీయాలు భిన్నంగా మారిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి  ఏపీపై పడింది. ఏపీలో ఎవరు గెలుస్తారన్న అంచనాలు ఎవరికి వారు వేసుకుంటున్నారు కానీ.. ఎవరూ ఊహించని విధంగా  ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఓ ప్రయోగం చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని  అడగడం ప్రారభించారు. అదే సమయంలో తాము వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఖాయమని రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తిరుపతి కార్పొరేషన్‌కు టీటీడీ నిధుల మళ్లింపు - స్టే ఇచ్చిన హైకోర్టు !
 తిరుమల తిరుపతి దేవస్థానం  (TTD) నిధులను తిరుపతిలో రహదారులు, పారిశుద్ధ్యం కోసం  మళ్లించడంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారంటూ  బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు . దీనిపై ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. టీటీడీ చర్యలు దేవాదాయ చట్టం సెక్షన్   111కు విరుద్ధమని.. రూ. వంద కోట్లు శ్రీవారి సొమ్ము  తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మళ్లించారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.  గతంలో ఎప్పుడూ తితిదే నిధులు మళ్లించలేదన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా పేరు మార్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో సంచలన నిర్మయం తీసుకుంది. డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు ఆ భవనాన్ని అధికారిక నివాసంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి