Hyderabad Is The Best City In India: హైదరాబాద్ మరోసారి దేశంలోనే బెస్ట్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం... దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది హైదరాబాద్.
హైదరాబాద్... ఒక మినీ ఇండియా. దేశంలో మరే నగరానికి లేన్నన్ని ప్రత్యేకతలు హైదరాబాద్ సొంతం. భాష, ఫుడ్, సంస్కృతి.. ఏనా సరే... అన్ని ఒక స్పెషలే. అన్ని ప్రాంతాల ప్రజలకు నచ్చే, మెచ్చే ప్రాంతమిది. వాతావారణం, కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో కూడా హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సెకండ్ హెడ్ క్వార్టర్స్‌గా మారింది హైదరాబాద్ నగరం. వేలాది కంపెనీలు ఇక్కడ కొలువుదీరుతున్నాయి. అంతేకాదు... లక్షలాది మంది ఇతర ప్రాంతాల వారికి కూడా హైదరాబాద్ ఉపాధి కల్పిస్తోంది. అందుకే... మహానగరంగా దినదినాభివృద్ధి చెందుతోంది హైదరాబాద్. విశ్వనగరం వైపు దూసుకెళ్తోంది. బెస్ట్ సిటీగా అవార్డులు అందుకుంటోంది. పూణే, బెంగళూరు లాంటి సిటీలను వెనక్కి నెట్టి అత్యుత్తమ నగరంగా.. నెంబర్ స్థానంలో నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాను మెర్సర్ సంస్థ (Mercers Quality Of Living Index) విడుదల చేసింది. మెర్సర్ అనే అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ, ఆర్థిక సేవల సంస్థ. ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్స్‌ను ఈ సంస్థ రిలీజ్ చేసింది. బెస్ట్ సిటీల జాబితాలో... ఇండియా నుంచి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పూణ్, బెంగళూరుకు చోటు దక్కింది. హైదరాబాద్ బెస్ట్ సిటీ(Best Indian City)గా నిలవడం ఇది ఆరోసారి. 2015 నుంచి హైదరాబాద్ బెస్ట్ సిటీగా కొనసాగుతూనే ఉంది.
మెర్సర్ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే... వియన్నా(ఆస్ట్రియా) తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జురిచ్ (స్విట్జర్లాండ్), మూడో స్థానంలో ఆక్లాండ్ (న్యూజిలాండ్) నిలిచాయి. ఇక... భారతలోని హైదరాబాద్‌కు 153వ స్థానం, పుణెకు 154, బెంగళూరుకు 156, చెన్నైకు 161, ముంబైకి ఐదో స్థానం, కోల్‌కతాకి 170, న్యూఢిల్లీకి 172వ స్థానం లభించింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఖార్టౌమ్ (సూడాన్) 241వ ర్యాంక్‌తో అట్టడుగున నిలిచింది.
హైదరాబాద్ వరుసగా ఆరోసారి బెస్ట్ సిటీగా అగ్రస్థానంలో ఉండటంతో మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ (KTR TWEET) చేశారు. హైదరాబాద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మెర్సర్ ర్యాకింగ్స్ (Mercers Rankings)లో హైదరాబాద్ నగరం పూణే (Pune), బెంగళూరు (Bengalore)ను వెనక్కి నెట్టి బెస్ట్ సిటీగా నిలిచిందంటూ ఓ ఇంగ్లీష్ కథనాన్ని పోస్ట్ చేశారు. దేశంలో మరోసారి హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా నిలిచిందని అన్నారు. ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు కేటీఆర్. గత తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నగరం ఆరు సార్లు మెర్సర్ చార్టుల్లో అగ్రస్థానంలో ఉండేలా చూసుకున్నామని అన్నారు. ఇక... కొత్త ప్రభుత్వం వంతు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి సూచన చేశారాయన.