Wife Swapping in Bengaluru: 


బెంగళూరులో ఘటన..


వైఫ్ స్వాపింగ్ (Wife Swaping). హైక్లాస్ వర్గంలో కొన్ని చోట్ల ఇది కామన్ అయిపోయింది. భార్యల్ని మార్చుకునే ఈ కాన్సెప్ట్‌ క్రమంగా మిగతా వర్గాలకూ విస్తరిస్తోంది. బెంగళూరులో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకి చెందిన ఓ వ్యక్తి తన భార్యను వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండాలంటూ టార్చర్ చేశాడు. తన ఫ్రెండ్‌తో బెడ్ షేర్ చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదని దారుణంగా కొట్టాడు. హింసించాడు. బాధితురాలు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాక కానీ ఇదంతా బయటపడలేదు. బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కంప్లెయింట్ ఆధారంగా భర్తపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే విచారణ కూడా మొదలు పెట్టారు. తన ఫ్రెండ్‌తో రాత్రి అంతా గడపాలని భర్త హింసించినట్టు ఫిర్యాదు చేసింది బాధితురాలు. బసవనగుడిలో ఉంటున్న నిందితుడు ఏడాది క్రితమే బాధితురాలని పెళ్లి చేసుకున్నాడు. రూ.10లక్షల కట్నం తీసుకుకావాలని అప్పటి నుంచే పదేపదే గొడవ పడుతున్నాడు. తనకు ఎన్నో అప్పులున్నాయని వాటన్నింటినీ తీర్చాలంటే కట్నం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. బెల్ట్‌తో దాడి చేశాడు. ఇప్పటికే బాధితురాలి కుటుంబం రూ.2 లక్షలు ఇచ్చింది. అయినా హింసిస్తూ వస్తున్నాడు. మిగతా రూ.8 లక్షలు ఇచ్చేంత వరకూ ఇలాగే హింసిస్తానని బెదిరించాడు. అసభ్యకరమైన వీడియోలు చూపించాడు. ఫ్రెండ్‌తో రాత్రుళ్లు గడపాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఒప్పుకోలేదని దారుణంగా చితకబాదాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడి కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేశారు పోలీసులు. వరకట్నం వేధింపుల కింద FIR రిజిస్టర్ చేశారు.   


నోయిడాలోనూ..


నోయిడాలోనూ ఇలాంటి దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో పడక పంచుకోవాలని ఓ వ్యక్తి తన భార్యను బలవంతం చేశాడు. మాట వినలేదన్న కోపంతో మందు తాగించాడు. ఒప్పుకోకపోతే విడాకులు ఇస్తానని బెదిరించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన మహిళ నోయిడాకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే...పెళ్లైనప్పటి నుంచి భర్తతో పాటు అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. వెస్టర్న్ లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడాలని ఆ మహిళను బలవంతం చేశారు. అంతే కాదు. భర్తతో ఎప్పుడు సన్నిహితంగా ఉండాలో అత్త డిసైడ్ చేసేది. వాళ్లు చెప్పినట్టు వినకపోతే మాటలతో తీవ్రంగా వేధించేవారు. ఈ క్రమంలోనే గతేడాది ఏప్రిల్ 18న ఆమె భర్త పార్టీ ఉందని చెప్పి ఓ ఫ్లాట్‌కి తీసుకెళ్లాడు. అక్కడే అతడి ఫ్రెండ్‌, ఫ్రెండ్ వైఫ్‌ కూడా ఉన్నారు. అప్పుడే వైఫ్ స్వాపింగ్ గురించి చెప్పాడు. "నువ్వు నా ఫ్రెండ్‌తో గదిలోకి వెళ్లు, నేను నా ఫ్రెండ్ భార్యతో గదిలోకి వెళ్తాను" అని చెప్పాడు. ఈ మాటలు విని ఆ మహిళ షాక్ అయింది. ఇష్టం లేదు అని తేల్చి చెప్పింది. అయినా ఊరుకోకుండా ఆమెకు బలవంతంగా మందు తాగించాడు. మాట వినకపోతే విడాకులిచ్చేస్తానని బెదిరించాడు. అయినా ఆ బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు. ఇదంతా జరిగి ఏడాదైన తరవాత...ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ.


Also Read: Loksabha Election 2024: టార్గెట్ 325, లోక్‌సభ ఎన్నికలపై జేపీ నడ్డా ఫోకస్ - త్వరలోనే కీలక భేటీ