Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 08 Dec 2022 05:55 PM
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ కేంద్ర ఎన్నిక సంఘం ప్రకటన జారీ చేసింది. బీఆర్ఎస్ గా గుర్తిస్తూ సర్టిఫికేట్ జారీ చేసింది ఈసీ. 

తిరుపతిలో నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృశ్యం 

Tirupati News : తిరుపతిలో నలుగురు విద్యార్థులు మిస్ అయిన ఘటన కలకలం రేపుతుంది. తిరుపతి నగరంలోని మంగళం బి.టి.ఆర్ కాలనీకి చెందిన నలుగురు బాలురు  కనిపించకుండా పోయారు.  బుధవారం ఉదయం స్కూల్ కు  బయలుదేరిన విద్యార్థులు స్కూల్ కి వెళ్లలేదు. మంగళం జెడ్పీ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న నాని చరణ్, మోహిత్ లతో పాటు ఆరో తరగతి చదివే లోకేష్, ఎనిమిదో తరగతి చదువుతున్న వెంకటేష్ లు మిస్ అయ్యారు. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీలు పరిశీలించిన పోలీసులు మొదట విద్యార్థులు కపిల్ తీర్థం వెళ్లి అక్కడి నుంచి లీలా మహల్ సర్కిల్ కు చేరుకున్నట్లు గుర్తించారు. ఆ తరువాత విద్యార్థులు ఎటు వెళ్లారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, నందకుమార్ నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇప్పటికే  సింహయాజీ విడుదల కాగా మిగిలిన ఇద్దరు ఇవాళ రిలీజ్ అయ్యారు. రామచంద్ర భారతి, నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులుండటం వలన వీరిద్దరూ చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 


ఫాంహౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్‌కు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు రూ.3లక్షల చొప్పున పూచీకత్తుతోపాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితులంతా పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతోపాటు సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, నందకుమార్ నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇప్పటికే  సింహయాజీ విడుదల కాగా మిగిలిన ఇద్దరు ఇవాళ రిలీజ్ అయ్యారు. రామచంద్ర భారతి, నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులుండటం వలన వీరిద్దరూ చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 


ఫాంహౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్‌కు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు రూ.3లక్షల చొప్పున పూచీకత్తుతోపాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితులంతా పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతోపాటు సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది.

Background

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభం కానుంది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒక దశలో, గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.


గుజరాత్లోని 37 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 182 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 92. ఈసారి ఓటింగ్ శాతం 2012 కంటే తక్కువగా ఉంది. 2017లో గుజరాత్‌లో 68.39 శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి 64.33 శాతం పోలింగ్ నమోదైంది. ద్రవ్యోల్బణం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడం, పెద్ద ప్రాజెక్టులకు భూసేకరణ, రైతుల సమస్యలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇషుదన్ గధ్వీ, హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ సహా 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది. 


గత 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో వరుసగా ఏడోసారి విజయం సాధిస్తామన్న ధీమాతో బీజేపీ ఉంది. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం గుజరాత్ లో బీజేపీదే విజయం అని అంచనా వేశాయి. గుజరాత్‌లో బీజేపీకి 128-140 సీట్లు, కాంగ్రెస్‌ 31-43 సీట్లు, ఆప్‌కు 3-11 సీట్లు, ఇతరులకు 2-6 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సీ-వోటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.


'గుజరాత్లో బీజేపీ తన రికార్డును బద్దలు కొడుతుంది'



గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోడీ మాట్లాడుతూ, "గుజరాత్ అంతటా బిజెపి తన రికార్డును బద్దలు కొడుతుంది. బీజేపీకి అత్యధిక శాతం వస్తుంది. ఈ మధ్యాహ్నం నాటికి మాకు ఫలితాలన్నీ తెలుస్తాయి. బీజేపీ పెద్ద ఎత్తున గెలుస్తుంది. బీజేపీ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేస్తోందని అన్నారు.


 ఎగ్జిట్ పోల్స్ విఫలం అవుతాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అన్నారు.



గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ వేవ్ ఉందని జిగ్నేష్ మేవానీ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్ కు, దేశానికి కొత్త దిశను ఇస్తాయని, రాష్ట్రంలో మార్పు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు నిరంకుశత్వానికి, నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీకి 120 సీట్లు వస్తాయి. అన్నారు. 


హిమాచల్‌ ప్రదేశ్‌లో గెలిచేది ఎవరు?




హిమాచల్ ప్రదేశ్ లో 10 వేల మంది భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు, ఇతర సహాయక సిబ్బంది పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 76.44 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది, కానీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది.


హిమాచల్ ప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ బిజెపి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 33 నుంచి 41 సీట్లు, కాంగ్రెస్ కు 24 నుంచి 32 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 0-4 సీట్లు, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయని ఏబీపీ సర్వే అంచనా వేసింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.