Breaking News Live Telugu Updates: సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 07 Dec 2022 04:32 PM
సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు: కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన


తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని వెల్లడి


బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జీరో అవర్లో లేవనెత్తగా.. సభలోనే ప్రకటన జారీ చేసిన కేంద్ర మంత్రి


----------------
సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉన్నప్పుడు 49% వాటా కల్గిన కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు


బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు


వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజన కల్గుతుంది


దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయి


బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయి


వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుంది


బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు


👆 ప్రహ్లాద్ జోషి, కేంద్ర బొగ్గుశాఖ మంత్రి

జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన  తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
జగిత్యాలలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
జగిత్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 
జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ ను ప్రారంభించిన  ముఖ్యమంత్రి కేసీఆర్

జగిత్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్

జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా హెలికాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక బస్సులో ప్రజలకు అభివాదం చేస్తూ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ బయలుదేరారు.

తాడిపత్రి మున్సిపాలిటీలో నిధుల కొరత- భిక్షాటన చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడపత్రి పట్టణంలో మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలు పనిచేయటం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన వాహనాలతోనే ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. 


పోలీసులు చెప్పినా జేసీ ప్రభాకర్‌రెడ్డి వినిపించుకోలేదు. ర్యాలీ జరుగుతుందని అనుచరులకు చెప్పారు. దీంతో భారీగా పోలీసులు ఆయన ఇంటి చుట్టూ మోహరించారు. అయినా జేసీ ప్రభాకర్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు. తాడిపత్రిలో సమస్య పరిష్కారం కోసం డబ్బులు ఇవ్వండి అంటూ భిక్షాటన ప్రారంభించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడక ర్యాలీ తీశారు. 


తాడిపత్రిలో చెత్తను సేకరించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలకు డీజిల్ ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. తాడిపత్రి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి భిక్షాటన ఒకటే మార్గమని అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీలో నిధులు లేక తాగునీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు కోసం నిరసన ర్యాలీ చేస్తున్నా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బెయిల్ వచ్చిన ఆరు రోజుల తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు సింహయాజీ విడుదల

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీ బెయిల్‌‌పై రిలీజయ్యారు. వాస్తవానికి ఆరు రోజుల క్రితమే ఆయనకు హైకోర్ట్‌ బెయిల్ ఇచ్చినప్పటికీ జామీను సమర్పించడంలో ఆలస్యమైంది. అందుకే ఇన్ని రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో 6 లక్షల పూచీకత్తుతోపాటు ఇద్దరి జామీ సమర్పించారు. ప్రక్రియ పూర్తైనందున ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సింహయాజీ నిరాకరించారు.

Background

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆగ్నేయంగా పయనిస్తోంది. సుమారు 22 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుంతో చెన్నైకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 


ఆగ్నేయంగా దూసుకొస్తున్న ఈ వాయుగుండం మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందనుంది. గురువారం ఉదయాని కల్ల ఉత్తర తమిళనాడు, పుదిచ్చేరీ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను తాకనుంది. 


ఇవాళ, రేపు(బుధవారం, గురువారం)తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 


తుపాను తీరం దాటే శుక్రవారం మాత్రం వర్షాలు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపనుంది. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాయలసీమలో కూడా వర్షాలు కుమ్మేయనున్నాయి. 


శనివారానికి వర్షాలు, గాలుల ప్రభావం తగ్గిపోనుంది. సీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ రోజు సాయంత్రానికి పరిస్థితి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


రెండు రోజుల పాటు ఈ తుపాను కొమసాగనుంది. గురువారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అరవై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. శుక్రవారం నాటికి గాలులు కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి. రెండు రోజుల పాటు తీవ్ర ప్రభావాన్ని చూపిన అనంతరం పదో తేదీ ఉదయానికి తుపాను వాయుగుండంగా మారిపోనుంది. శనివారం ఉదయం కూడా గాలుల ప్రభావం అదే స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 


ఇవాళ్టి(బుధవారం) నుంచి పదో తేదీ ఉదయం వరకు సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని జాలర్లు వేటకు వెళ్లకోపోవడమే మంచిదని వాతావరణ శాఖ సూచిస్తోంది. తీర ప్రాంతాల్లో ఉంటున్న మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు. 


కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి నష్టం జరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  
 పూరి గుడిసెలకు నష్టం. ఇంటిపై వేసిన మెటల్ షీట్లు ఎగిరిపోవచ్చు.
 విద్యుత్‌, కమ్యూనికేషన్ లైన్లకు స్వల్ప నష్టం.
 కచ్చా, పక్కా రోడ్లకు కొంత నష్టం. 
 చెట్ల కొమ్మలు విరగడం, చెట్లు పెకిలించడం. 
 అరటి , బొప్పాయి చెట్లకు, తీరప్రాంత వ్యవసాయానికి నష్టం. వరి, ఇతర పంటలకు నష్టం.
 భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో వరదలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగవచ్చు. 


కోస్టల్ తమిళనాడు, పుదుచ్చేరి, ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో తీసుకోవాల్సిన చర్యలు
 ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు ఫిషింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడం
 7-10 డిసెంబర్ సమయంలో ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ కార్యకలాపాలను నియంత్రణ
 ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన
 


తెలంగాణలో వాతావరణం


తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చు. వర్ష సూచన అయితే లేదు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.