Andhra Pradesh News Today : లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్ - అభ్యర్థిని నిలిపిన I.N.D.I.A కూటమి, చరిత్రలోనే తొలిసారిగా!
18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ క్రమంలో స్పీకర్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. విపక్ష I.N.D.I.A కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి ఆశించగా.. అది దక్కకపోవడంతో స్పీకర్ పదవి కోసం పోటీ పడుతోంది. అయితే, ఎప్పటిలాగే లోక్‌సభ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వం యత్నించగా.. I.N.D.I.A కూటమి సైతం బరిలోకి దిగడంతో అది సాధ్యపడలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరా?' - స్పీకర్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లేఖ
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి (Ayyannapatrudu) లేఖ రాశారు. శాసనసభలో మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధమని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లుగా ఉందని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని.. పార్లమెంటులో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


విశాఖ మాజీ ఎంపీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు - హయగ్రీవ భూముల వివాదంలోనే
విశాఖ మాజీ ఎంపీ,  ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవీవీ సత్యనారాయణతో పాటు, ఆడిటర్ జీవీ ఆలియాస్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు గద్దె  బ్రహ్మాజి అనే మరో వ్యక్తిపై విశాఖలో నాన్ బెయిలబుల్  కేసులు నమోదయ్యాయి. హయగ్రీవ కన్‌స్ట్రక్ష్నస్ అదినేత జగదీశ్వరుడు ఎంవోయూ పేరిట తనపై ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారని పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ పత్రాలతో విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు భారీ ఊరట- ఆ కేసులో స్టే ఇచ్చిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఊరట లభించింది. 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై పెట్టిన కేసు అక్రమమైందని కేసీఆర్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు స్టే ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో రైల్‌, రోడ్డుపై టీఆర్‌ఎస్‌ ఉద్యమాలు చేసింది. 2011లో అప్పటి జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ వాదులు రైల్‌రోకో చెప్పారు. ఇలా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారని చాలా మందిపై కేసులు పెట్టారు. ఆ జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నారు. ఆయనపై కూడా కేసు నమోదు అయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగుబాటు - రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
తెలంగాణ కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అసంతృప్తి రాజేస్తోంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను (Sanjay Kumar) పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లూ ఎవరి మీద కొట్లాడానో వారినే తనకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి