MVV Satyanarayana : విశాఖ మాజీ ఎంపీ, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవీవీ సత్యనారాయణతో పాటు, ఆడిటర్ జీవీ ఆలియాస్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు గద్దె బ్రహ్మాజి అనే మరో వ్యక్తిపై విశాఖలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. హయగ్రీవ కన్‌స్ట్రక్ష్నస్ అదినేత జగదీశ్వరుడు ఎంవోయూ పేరిట తనపై ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారని పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ పత్రాలతో విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన విషయం తెలియడంతో వెంటనే ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అసలు వివాదం ఏమిటంటే ?
వృద్దులు, అనాథలకు నిర్మించేందుకు విశాఖలోని ఎండాడలో 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు 12.44 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. అక్కడ కట్టే ఇళ్లు వృద్ధులకు మాత్రమే విక్రయించాలన్నది నిబంధన. కానీ ఆ భూమిలో జగదీశ్వరుడు ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. నిబంధనలు ఉల్లంఘించినందున తర్వాత ప్రభుత్వాలు భూకేటాయింపుల రద్దుకు ప్రయత్నించగా, ఆయన కోర్టులకు వెళ్లి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
అవసరం లేని చేరికలతో రిస్క్ చేస్తున్న రేవంత్ - కాంగ్రెస్‌ను మరో బీఆర్ఎస్ చేస్తారా ?
గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తితో జగదీశ్వరుడు ఎంవోయూ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వతా జగదీశ్వరుడు మొదట గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తికి హయగ్రీవ సంస్థలో 75 శాతం వాటా ఇస్తూ భాగస్వామిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు అలియాస్ జీవీ పేరిట జీపీఏ చేశారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ నుంచి అనుమతుల్లేకుండానే ఆ భూమిని 30 మందికి వెయ్యి గజాలు చొప్పున అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను ఎవరికీ జీపీఏ చేయలేదని అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీ తన నుంచి ఆ భూమిని బలవంతంగా చేజిక్కించుకున్నారని జగదీశ్వరుడు 2021లో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
చంద్రబాబు మైలేజీ పెంచుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలు - టీడీపీ విజయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారా ?
కలెక్టర్ మల్లికార్జున వివాదాస్పద నిర్ణయాలు
హయగ్రీవ ప్రాజెక్టుకి కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని మొదట ప్రభుత్వానికి సిఫారసు చేశారు అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున. తర్వాత ఆయనే చేతులు మారిన హయగ్రీవ ప్రాజెక్టుకి నిరభ్యంతర పత్రం జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ఎంవోయూ తాను చేయలేదని.. ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని జగదీశ్వరుడు కేసు పెట్టడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.