Hyderabad: తెలంగాణ హైకోర్టు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఊరట లభించింది. 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై పెట్టిన కేసు అక్రమమైందని కేసీఆర్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు స్టే ఇచ్చింది.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో రైల్, రోడ్డుపై టీఆర్‌ఎస్ ఉద్యమాలు చేసింది. 2011లో అప్పటి జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ వాదులు రైల్‌రోకో చెప్పారు. ఇలా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారని చాలా మందిపై కేసులు పెట్టారు. ఆ జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నారు. ఆయనపై కూడా కేసు నమోదు అయింది.
రైల్‌రోకోలో పాల్గొన్నట్టు తనపై పెట్టిన కేసు అక్రమమైనదని కేసీఆర్ తరఫున లాయర్ వాదిస్తున్నారు. అసలు ఆ రైల్‌రోకోలో తాను పాల్గొనలేదని చెప్పుకొచ్చారు. అయనా రైల్వే ట్రైబ్యునల్‌లో వాదన నిలబడ లేదు.
రైల్వే ట్రైబ్యునల్‌లో నమోదైన కేసుపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోగలిగారు. ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. అనంతరం కేసును జులైకి వాయిదా వేసింది.