Telangana News Today | ఏ సెంటర్‌లోనైనా చర్చకు వస్తావా- రేవంత్‌కు హరీష్ సవాల్- రుణమాఫీపై రాజుకున్న రాజకీయం
తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ మొదలైంది. రుణమాఫీ చేశాం హరీష్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శుక్రవారం ఫ్లెక్సీలు వేసింది. ఇప్పుుడు పోటీగా బీఆర్‌ఎస్ కూడా ఫ్లెక్సీలు వేసింది. ఇలా ఒకరిపై ఒకరు ఫ్లెక్సీలతో విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. పంచపాడవుల కథలా తెలంగాణలో రుణమాఫీ ఉందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. 22 లక్షల మందికే రుణమాఫీ చేశారని అన్నారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం 14 వేల కోట్లు కోత పెట్టిందని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తిర్యాణి నుంచి సీఎం క్యాంపు ఆఫీస్‌కు పాదయాత్ర- సమస్యల పరిష్కారం కోసం గిరిజనుడి పోరాటం
గ్రామ సమస్యలు తీర్చాలని, గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ముందు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు పెందూర్ ధర్ము అనే ఆదివాసి నాయకుడు. ఇది గత నెల 6న కుమ్రం భీం జిల్లా కలెక్టర్ వన మహోత్సవం కార్యక్రమానికి తిర్యాణి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన. సమస్య తీరుస్తామని కలెక్టర్ చెప్పడంతో ధర్నా విరమించారు. కానీ సమస్య నేటికీ పరిష్కారం కాలేదని మరోసారి రోడ్డెక్కాడు ఆ నేత. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సాయంత్రం ప్రధానమంత్రితో చంద్రబాబు భేటీ- నిధులు, ఇతర రాజకీయ అంశాలపై చర్చ
ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ కేంద్రం పెద్దలతో సమావేశంకానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రధానమంత్రి మోదీ అపాయింట్‌మెంట్ దొరికినట్టు తెలుస్తోంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు చెబుతూనే ఇంకా తేలాల్సిన అంశాలపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా పోలవరం నిధుల అంశంపై చర్చించనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కీలకమైన భేటీల్లో పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖమంత్రితో సమావేశమై పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హిందూపురం మున్సిపాలిటీ టిడిపి కైవసం - ఛైర్‌పర్శన్ రాజీనామా
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తన బలాన్ని కోల్పోతూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయ పార్టీలవైపు తొంగి చూస్తూ ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకునేందుకు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటే కనుమరుగవుతామని మరో పార్టీలోకి వలసలు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోంది. గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చలాయించింది. రాష్ట్రంలో ఉన్న ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప దాదాపు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లను క్లీన్ స్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తప్పు తెలుసుకున్న విద్యుత్ డిస్కంలు- పేమెంట్ యాప్స్ ద్వారా బిల్లుల చెల్లింపు విధానం పునరుద్ధరణ
తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. రెండు నెలలుగా పడుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. చేసిన తప్పును తెలుసుకున్న డిస్కంలు దారిలోకి వచ్చాయి. ఎప్పటి మాదిరిగానే డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చెల్లించవచ్చని సెలవిచ్చాయి. డిజిటల్ పేమెంట్ యాప్స్ వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు చెల్లించడం చాలా సులభమైపోయింది. అంతకు ముందు ఈ బిల్లు చెల్లించేందుకు పెద్ద యుద్ధాలే జరిగేవి. అయితే ఈ మధ్య కాలంలో డిస్కంలు తీసుకున్న నిర్ణయం చాలా వివాదాస్పదమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి