Bird Unveiling National Flag : భారతదేశంలో గాలి పీల్చుకునే ప్రతి ఒక్కరికి భారతీయత గుండెల నిండుగా ఉంటుంది. అందులో సందేహం లేదు. అయితే ఈ భారతీయత మనుషులకే కాదు... పశు పక్ష్యాదులకూ ఉంటుందని అప్పుడప్పుడూ నిరూపితమవుతూ ఉంటుంది. ఓ పక్షి చేసిన విన్యాసం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతా జెండా పండుగ నిర్వహించుకుంటారు. జెండా ఆవిష్కరించాలంటే.. ఓ ప్రత్యేకమైన పద్దతి ఉంటుంది. పైకి తీసుకెళ్లి దాన్ని ఆవిష్కరించేలా తాడుతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. కొన్ని చోట్లా.. పైగా దాకా వెళ్లినా.. పతాకావిష్కరణ చేయడానికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పైన గట్టిగా పట్టేస్తుంది. ఇలాంటి సందర్భాలు విఐపీలు ఆవిష్కరించే సందర్భాల్లోనూ ఉంటాయి. ఇలాంటి సమస్య ఓ చోట వచ్చింది.
జాతీయ పతకావిష్కరణకు హోస్ట్ ప్రయత్నించారు. అయితే జాతీయ పతాకం పై వరకూ వెళ్లింది కానీ.. ఆవిష్కరణ కావడం లేదు. ఎంత సేపు ప్రయత్నించినా అదే్ సమస్య. ఏం చేయాలా అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో ఓ పక్షి దూరం నుంచి వచ్చింది. రావడం రావడం జెండా దగ్గరకు వచ్చింది. చిక్కుముడిని ఇట్టే విప్పేసింది. పతకావిష్కరణ చేసింది. వచ్చిన దోవనే వెనక్కి వెళ్లిపోయింది.
పక్షి పతాకావిష్కరణ చేయడంతో అందరూ.. జెండా వందనం చేసి చప్పట్ల్లు కొట్టారు. జెండా వందనాన్ని వీడియో తీసి.. తమ గ్రూపుల్లో సర్క్యూలేట్ చే్యాలనుకున్న అక్కడి వారికి అది వైరల్ వీడియో అవుతుందని అనుకోలేదు. ఆ పక్షి దేశభక్తిని ఇప్పుడు దేశం మొత్తం అబ్బరపడి చూస్తోంది.
ఈ ఘటన కేరళలో జరిగిందని నెటిజన్లు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఎక్కడ జరిగిందో మాత్రం స్పష్టత లేదు. ఎక్కడ జరిగితే ఏమి ఆ పక్షి దేశభక్తిని మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు.
ఆ పక్షి ఇప్పుడు ఎక్కడ ఉందో.. కానీ.. ఎవరైనా ఆ పక్షిని కనిపెడితే సోషల్ మీడియా అంతా కలిసి భారతరత్నను మించిన అవార్డును ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పక తప్పదు.