Andhra Pradesh News Today: ఏపీ స్పీకర్‌గా అయ్యన్న బాధ్యతల స్వీకరణ - ఆయన ఎప్పుడూ ఫైర్ బ్రాండేనన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కొత్త స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఈ స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు వైసీపీ దూరంగా ఉంది. స్పీకర్ పదవికి నామినేషన్ ఒకటే దాఖలు అయినందున ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. రు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ ఆయన్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
2021 నవంబర్ 19 నాటి ఘటన గుర్తు చేసుకొని చంద్రబాబు ఎమోషన్ - ఇదే దేవుడు స్క్రిప్టు అంటూ సెటైర్లు
స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు రెండున్నరేళ్లు తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు. అనాటి పరిస్థితులు మరోసారి గుర్తు చేశారు. తన ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణంలేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు. ఐదేళ్లుగా నీచ రాజకీయాలు చూశామన్నారు చంద్రబాబు. సభలో ప్రశ్నించిన తమ సభ్యులను అసభ్యకరమైన భాషలో తిట్టారని తెలిపారు. చివరకు తన నిరసన తెలియజేసి వెళ్లిపోతామని చెప్పినా మైక్ ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వైసీపీ గెలిచిన నాటి నుంచి మొన్నటి వరకు సభ నడిపిన తీరు ప్రజలు గమనించారన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీకి మరో షాక్- విశాఖ వైసిపి ఆఫీస్‌కి కూడా నోటీసు- వారం రోజులే గడువు
విశాఖలోని ఎండాడలో ఉన్న వైసీపీ కార్యాలయానికి కూడా ప్రభుత్వాధికారులు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చారు. సరైన అనుమతు లేకుండా నిర్మించారన్న కారణంతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని పడగొట్టేశారు సీఆర్డీఏ అధికారులు. ఆ షాక్‌లో ఉన్న వైసీపీకి మరో షాక్ తగిలింది. వైజాగ్‌లో నిర్మించిన కార్యాలయం కూడా అక్రమంగా నిర్మించిందేనంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రుణమాఫీ అయిపోయినట్లు హడావుడి - రేవంత్‌ది మోసమే - బీఆర్ఎస్ ఘాటు విమర్శలు
కేబినెట్‌లో చర్చించి రుణామాఫీ చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. రూ.31 వేల కోట్లలో ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండానే దానిని పెద్దా సాయంగా రేవంత్ ప్రభుత్వం బూతద్దంలో చూపుతుందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. క్యాబినెట్ చర్చ కాగానే రుణమాఫీ చేసినట్లు ఒక సెక్షన్ మీడియా చిత్రీకరిస్తున్నదని.. పిల్ల పుట్టక ముందే మీడియా కుల్లకుడుతుందని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హెల్త్ టూరిజం హబ్‌లో బసవతారకం ఆస్పత్రికి స్థలం - సీఎం రేవంత్ హామీ
తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో హెల్త్ టూరిజం హబ్ గురించి ప్రకటించారు. అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు. ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందని.. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి