Kamal Haasan’s Indian 2  Theatrical Trailer Release: అగ్ర‌క‌థానాయకుడు క‌మ‌ల్ హాస‌న్, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్ లో వ‌స్తున్న సినిమా భార‌తీయుడు - 2. 1996లో ‘భార‌తీయుడు’ సినిమా బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా.. పార్ట్ - 2 వ‌స్తోంది. దీంతో ఈ సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి ప్రేక్ష‌కుల్లో. ఈ సినిమాకి సంబంధించి ఫ‌స్ట్ పోస్ట‌ర్, సాంగ్స్ ఇప్ప‌టికే జ‌నాల్లో క్రేజ్ ని పెంచాయి. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఈ సినిమాపై అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ సినిమా థియ‌ట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించారు.


ట్రైల‌ర్ ఎప్పుడంటే?


‘భార‌తీయుడు - 2’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్. జూన్ 25న థియ‌ట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ముంబైలో నిర్వ‌హించే ఒక స్పెష‌ల్ ఈవెంట్ లో ట్రైల‌ర్ లాంచ్ చేయ‌బోతున్నార‌ట‌. ట్రైల‌ర్ పై ఇప్ప‌టికే సూప‌ర్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ ట్రైల‌ర్ 2 నిమిషాల 30 సెకన్లు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ట్రైల‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత క్రేజ్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.


జులై 12 రిలీజ్..


ఈ సినిమా జులై 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది మూవీ టీమ్. కాగా.. ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లుపెట్టింది మూవీ టీమ్. ఇప్ప‌టికే పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. రెండు లిరిక‌ల్ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఒక‌టి క‌మ‌ల్ హాస‌న్ పాట కాగా.. ఇంకోటి రొమాంటిక్ పాట‌. ర‌కుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ మీద తెర‌కెక్కించారు ఆ పాట‌. ఆ రెండు పాట‌లు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.


ఈ సినిమాలో.. క‌మ‌ల్ హాస‌న్ కి స‌ర‌స‌న‌ టాలీవుడ్‌ చందమామా కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సిదార్థ‌, ఎస్ జే సూర్య‌, బాబీ సింహ‌, ప్రియ భ‌వాని శంక‌ర్, బ్రహ్మానందం, స‌ముద్ర‌ఖ‌నీ త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమాకి శంక‌ర్ ద‌ర్శ‌కుడు కాగా.. లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జియాంట్ మూవీస్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.


'భార‌తీయుడు' సూప‌ర్ హిట్..


1996లో రిలీజైన 'భార‌తీయుడు' సినిమా అప్ప‌ట్లోనే దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఈ సినిమా తీస్తున్నారు. భార‌తీయుడులో క‌మ‌ల్ హాస‌న్ ద్విపాత్రాభిన‌యం చేశారు. భార‌త దేశంలో జ‌రుగుతున్న అవినీతి, స్వాతంత్య్రం రాక‌ముందు ప‌రిస్థితులు ఆధారంగా సినిమాని తెర‌కెక్కించారు. ఇక ఈ సినిమా గురించి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో క్రేజ్ క్రియేట్ అయ్యింది. కాగా.. ఈ సినిమా త‌న కెరీర్ లో చాలా ప్ర‌త్యేకం అని, ఆత్మ‌విశ్వాసం క‌లిగిన అమ్మాయిగా న‌టిస్తున్నాన‌ని చెప్పారు ర‌కుల్ ప్రీత్ సింగ్. ఇదిలా ఉంటే.. ఇక జులై 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. చెన్నై ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు సమక్షంలో 'భారతీయుడు 2' ఆడియో లాంచ్‌ జరగనున్న‌ట్లు స‌మాచారం. 


Also Read: ‘కల్కి 2898 AD’లో మాళవికా నాయర్ క్యారెక్టర్ అదే - ట్రైలర్‌లో మహాభారతం రిఫరెన్స్